NTV Telugu Site icon

Puri Jagannadh: రచ్చ గెలిచి ఇంటి మీద పడ్డ పూరి.. ఈసారి ఆ హీరోతో..?

Puri

Puri

Puri Jgannadh: ఇంట గెలిచి రచ్చ గెలవాలి అనేది పెద్దల మాట. కానీ, పూరి ప్రస్తుతం రచ్చ గెలిచి ఇంటిని గెలవాలని చూస్తున్నాడు. అదేనండీ.. కొడుకును హీరోగా నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడని టాక్. పూరి కొడుకు ఆకాష్ తండ్రి పేరును పెట్టుకొని ఇండస్ట్రీలో ఎంటర్ అయ్యాడు. ఆకాష్ ఎంచుకున్న కథల ప్రభావమో.. లేక ఆకాష్ నటన నచ్చలేదో ఆ సినిమాలు ఎంత ప్రమోషన్స్ చేసినా కూడా ప్రేక్షకుల మైండ్ కు ఎక్కలేదు. ఇక పూరి సైతం కొడుకు కోసం కథను, డైలాగ్స్ ను రాసాడే తప్ప డైరెక్షన్ చేసింది లేదు. యావరేజ్ హీరోలను మాస్ హీరోలుగా నిలబెట్టిన చెయ్యి.. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ ను హీరోగా మార్చగల సత్తా ఉన్న డైరెక్టర్.. ఇన్ని పెట్టుకొని పూరి, కొడుకును మాత్రం పట్టించుకోలేదనే అసహనం అభిమానుల్లో కూడా ఉంది.

లైగర్ సినిమాతో భారీ పరాజయాన్ని చవిచూసిన పూరి ప్రస్తుతం మరో కథను సిద్ధం చేసుకుంటున్నాడు. అయితే ఈసారి ఆ హీరోను.. ఈ హీరోను నమ్ముకుంటే లాభం లేదు అనుకున్నాడో.. లేక అందరి హీరోలకు సమానంగా తన కొడుకును చూడాలనుకున్నాడో ఏమో తెలియదు కానీ, ఈసారి నుంచి కొడుకును నిలబెట్టేవరకు పూరి నిద్రపోకూడదని నిశ్చయించుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాతో ఆకాష్ జీవితమే మారిపోతుందని..అంత అద్భుతమైన కథ రాస్తున్నట్లు ఆయన సన్నిహితుల నుంచి లీకులందుతున్నాయి. మరి ఈసారైనా ఆకాష్ జీవితం మారుతుందా..? లేదా..? అనేది తెలియాల్సి ఉంది.