Site icon NTV Telugu

Sobhita : శోభిత కొత్త మూవీ.. ఆ రూమర్లకు చెక్

Sobhita Dhulipala

Sobhita Dhulipala

Sobhita : నాగచైతన్య – శోభిత ప్రస్తుతం మ్యారేజ్ లైఫ్‌ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇద్దరూ ఎక్కువ సమయం ఏకాంతంగా గడిపేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. పైగా ఫంక్షన్లకు ఇద్దరూ కలిసి వెళ్తున్నారు. అయితే పెళ్లి తర్వాత శోభిత ఎలాంటి సినిమాలు చేయకుండా ఖాళీగానే ఉంది. దీంతో ఆమె పెళ్లి తర్వాత సినిమాలు మానేయాలని డిసైడ్ అయిందని.. భర్త, ఫ్యామిలీని చూసుకునేందుకు నిర్ణయించుకుందనే టాక్ నడిచింది. పైగా ఈ మధ్య ఆమె పెద్దగా బయటకు వెళ్లట్లేదు. దీంతో ఆమె ప్రెగ్నెంట్ అంటూ ప్రచారం జరిగింది. కానీ తాజాగా ఆమె ఓ కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Read Also : Urvashi-Rautela : ఈడీ విచారణకు హాజరైన హీరోయిన్

తమిళ స్టార్ డైరెక్టర్ పా రంజిత్ తీస్తున్న సినిమాలో దినేష్ హీరోగా నటిస్తుండగా ఆర్య కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ సినిమాలో శోభితను హీరోయిన్ గా తీసుకున్నారు. దీంతో ఆమె పెళ్లి తర్వాత సినిమాలు చేయదు అనే రూమర్లకు చెక్ పడింది. పెళ్లి తర్వాత కూడా తన కెరీర్ ను వదులుకునేందుకు శోభిత ఇష్టపడట్లేదని క్లారిటీ వచ్చేసింది. ఆమెకు నాగచైతన్య కూడా ఫుల్ సపోర్ట్ ఇవ్వడంతోనే ఆమె ఇలా ముందుకు వెళ్తుందని అంటున్నారు. పా రంజిత్ సినిమాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మరి ఇందులో ఆమె ఎలా కనిపిస్తుందో వేచి చూడాలి.

Read Also : OG : పవన్ నమ్మకాన్ని నిలబెట్టిన ఆ ఇద్దరు.. ఈ ఫొటోనే సాక్ష్యం

Exit mobile version