శాండిల్ వుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచిన చిత్రం ‘సు ఫ్రమ్ సో (సులోచన ఫ్రం సోమేశ్వర)’. రాజ్ బి శెట్టి నటించిన ఈ సినిమా గత నెల జులై 25న ఎటువంటి హంగామా లేకుండా రిలీజ్ అయి రిలీజ్ తర్వాత సంచలనం సృష్టించింది. కేవలం రూ.6 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు ఓ సెన్సేషన్ అనే చెప్పాలి. సింపుల్ కథతో తెరకెక్కి బ్లాక్ బస్టర్ వసూళ్లు రాబట్టింది.
Also Read : Ghaati : ఘాటీ ఇన్ సైడ్ టాక్.. ‘స్వీటీ’ అంటే ‘స్వీట్’ అనుకుంటివా?
కాగా ఈ సినిమా ఒరిజినల్ వర్షన్ రిలీజ్ అయి 40 డేస్ అవుతోంది. ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ చూస్తే వరల్డ్ వైడ్ గా రూ.123 గ్రాస్ రాబట్టి సూపర్ సెన్సేషన్ హిట్ గా నిలిచింది. కేవలం కర్ణాటకలో రూ. 97 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. కన్నడలో రిలీజ్ అయిన తర్వాత కొద్ది రోజుల గ్యాప్ తో తెలుగులోనూ అదే పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ. 2.85 కోట్లు వసూలు చేసింది. కాకుంటే తెలుగులో బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా కాస్త వసూలు చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్స్ లో డీసెంట్ గా వసూలు చేస్తోంది సు ఫ్రమ్ సో. ఇక నిర్మాతలకు పెట్టిన పెట్టుబడికి 20 % పైగా రిటర్న్స్ అందించి బాక్స్ ఆఫీస్ దగ్గర రిమార్కబుల్ రన్ ను అందుకుని దూసుకెళ్తోంది. సినిమా ఫైనల్ రన్ లో ఇంకా లాభాలు తెచ్చిపెట్టే ఛాన్స్ ఉంది. థియేటర్స్ లో సూపర్ హిట్ అయిన ఈ సినిమా సెప్టెంబర్ 5న ఓటీటీ రిలీజ్ కానుంది.
