NTV Telugu Site icon

Smriti Irani: కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కాషాయ బికినీ ఫోటో వైరల్..

Smrithi

Smrithi

Smriti Irani:ప్రస్తుతం బాలీవుడ్ కు, బీజేపీ కు మధ్య పెద్ద పెద్ద యుద్ధమే నడుస్తోందని చెప్పొచ్చు. పఠాన్ సినిమాలో దీపికా వేసుకున్న కాషాయ రంగు బికినీతో ఈ చిక్కంతా వచ్చింది. ఆ రంగు దుస్తులను ధరించి ఇలాంటి రొమాంటిక్ సీన్లు ఎలా చేస్తారని మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి నరోత్తమ్ మిశ్రా మండిపడ్డ విషయం తెల్సిందే.. ఆ సీన్లు, ఆ డ్రెస్ తొలగించకపోతే సినిమా రిలీజ్ ను అడ్డుకుంటామని మీడియా ముందు చెప్పుకొస్తున్నారు. ఇక ఈ విషయాన్ని బీజేపీ పెద్దది చేసి చూపిస్తోందని మరికొందరు చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా దీపికా కన్నా ముందు కాషాయ రంగు బికినీ వేసుకున్న హీరోయిన్ల ఫోటోలను షేర్ చేస్తూ అప్పుడెందుకు రియాక్ట్ అవ్వలేదని ప్రశ్నిస్తున్నారు.

ఇక తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని కూడా ఇందులోకి లాకొచ్చారు. ఆమె ఒకప్పుడు మోడల్ అన్న విషయం తెల్సిందే. 1998 లో ఆమె మిస్ ఇండియా పోటీల్లో కాషాయ రంగు బికినీ వేసుకొని క్యాట్ వాక్ చేసింది ఆ వీడియోను వైరల్ చేస్తూ దీపిక అభిమానులు రైట్ వింగ్ ట్రోల్స్ పై ఎన్ కౌంటర్ స్టార్ట్ చేసారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. బీజేపీ కావాలనే ఈ బికినీ వివాదాన్ని రెచ్చగొడుతోందని పలువురు చెప్పుకొస్తున్నారు. మరి ఈ వివాదం ఎప్పుడు ముగుస్తుందో చూడాలి.

Show comments