నటి సమంత ఆదివారం కడపలో మాంగల్య షాపింగ్ మాల్ ను ఆవిష్కరించింది. సమంత వస్తున్న విషయానికి భారీ ప్రచారం చేయటంతో కడపలో అభిమానులు వెల్లువెత్తారు. ఆ తర్వాత కడపలోని దర్గాని కూడా దర్శించుకున్నారు సమంత. కడప పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్న కొన్ని గంటల్లోనే అస్వస్దతకు గురయ్యారు సమంత. తీవ్రమైన జలుబుతో ఇబ్బంది పడ్డ సమంత సోమవారం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ఎఐజి అసుపత్రిలో టెస్ట్ లు చేయించుకొని ఇంటికి వెళ్లి రెస్ట్ తీసుకుంటున్నారు.
Read also : నిద్ర లేచింది ‘పురుష లోకం’.. సమంత సాంగ్ పై కేసు
ఇటీవల నాగచైతన్యతో విడాకులు తీసుకున్న సమంత నటించిన తమిళ సినిమా ‘కాతువాకుల రెండు కాదల్’ విడుదలకు సిద్ధంగా ఉంది. గుణశేఖర్ దర్శకత్వంలో ‘శాకుంతలం’ షూటింగ్ పూర్తి చేసింది. తెలుగులో ఇటీవల శ్రీదేవి మూవీస్ పతాకంపై హరి హరీశ్ దర్శకత్వంలో ప్యాన్ ఇండియా మూవీ ‘యశోద’లో నటించటానికి కమిట్ అయింది. అలాగే ఓ అంతర్జాతీయ సినిమా కూడా సైన్ చేసింది. సమంత ‘పుష్ప’ సినిమాలో చేసిన ఐటమ్ సాంగ్ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉండటం గమనార్హం.
