Site icon NTV Telugu

SK21: ఎన్నా .. తలైవా.. ఏమన్నా కాంబినేషనా

Sk12

Sk12

SK21: పర్ఫెక్ట్ కాంబినేషన్ ఎప్పుడూ అభిమానులకు అంచనాలను పెంచుతూనే ఉంటుంది. ఒక స్టార్ డైరెక్టర్.. స్టార్ హీరో హీరోయిన్లు.. స్టార్ ప్రొడక్షన్ బ్యానర్ లో సినిమా అంటే.. అభిమానుల అంచనాలు ఆకాశంలో ఉంటాయి. ప్రస్తుతం తమిళ్ తంబీల అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. ఆ సినిమానే SK21. కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్, లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి జంటగా స్టార్ డైరెక్టర్ రాజ్ కుమార్ పెరిసామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం SK21. విశ్వనటుడు కమల్ హాసన్ సొంత నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించగా.. తాజాగా ఈ చిత్రాన్ని నేడు పూజా కార్యక్రమాలతో మొదలుపెట్టారు.

Naga Chaitanya: సమంతతో గొడవలు అవే .. వారివల్లే మేము విడిపోయాం.. ఎట్టకేలకు నోరువిప్పిన చై

చెన్నెలో ఈ పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా జరిగాయి, శివ కార్తికేయన్, సాయి పల్లవి, కమల్ హాసన్, తదితరులు ఈ పూజకు హాజరయ్యారు. ఇక ఈ సినిమాపై మొదటి నుంచి అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. సాయి పల్లవి చాలా గ్యాప్ తరువాత ఈ సినిమాలో కనిపిస్తుంది. ఇక కమల్.. విక్రమ్ తరువాత.. తన బ్యానర్ లో తీస్తున్న సినిమా కావడంతో మంచి హైప్ వచ్చింది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకోనుంది. మరి ఈ సినిమాతో ఈ కాంబో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

Exit mobile version