Site icon NTV Telugu

Jigarthanda DoubleX: మంచోడు గురించి సినిమా తీస్తే ఎవరూ చూడరమ్మా!

Jigarthanda

Jigarthanda

Jigarthanda DoubleX Trailer Released: తమిళంలో సూపర్, డూపర్ హిట్ కొట్టిన ‘జిగర్ తండా’ మూవీకి సుమారు పదేళ్ల తర్వాత ప్రీక్వెల్ రెడీ చేశారు. ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో రాఘవ లారెన్స్, ఎస్ జె సూర్య ప్రధాన పాత్రలు పోషిస్తుండగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. నిమిషా సజయన్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ‘‘పాన్ ఇండియాలో ఇప్పుడు వచ్చే సినిమాల్లో.. అతనిలాంటి ఒక నల్లని హీరోను ఊహించుకుని చూడండి చూద్దాం’’ అంటూ మొదలైన ట్రైలర్ లో ‘‘నలుపు అంటే అంత చులకనా నీకు’’ అనే బ్యాక్‌గ్రౌండ్ వాయిస్‌తో నడిచింది. ‘‘సినిమాల్లో హీరో అంటే తెల్లగానే ఉండాలిగా మరి’’ అనే మరోకరి గొంతు వినిపిస్తుండగా ‘తెలుగు సినిమాలో మొదటి నల్ల హీరో అంటూ.. గుర్రంపై వస్తున్న లారెన్స్‌ను స్టైలిష్‌గా చూపించారు మేకర్స్. ఆ తర్వాత ‘‘నువ్వే గొప్ప హిస్టీరియా సృష్టించే పాండ్య సినిమా డైరెక్టర్ అంటూ ఎస్జే సూర్య పాత్రను పరిచయం చేయగా నేను రే దాశన్, తెలుగు సినిమా దర్శకుడిని.

Kamakshi Bhaskarla : ఆ స్టార్ హీరో సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసిన పొలిమేర బ్యూటీ..?

నేను అసిస్టెంట్ డైరెక్టర్‌గా సత్యజిత్ రే దగ్గర పనిచేస్తున్నప్పుడు. ఒక రోజు ఆయన నన్ను పిలిచి.. అరె సాలా ముజ్‌కో లగ్ రహా మై కి తుమ్ ఏక్ దమ్ తయార్ హోగయా జాకే సినిమా కరో (నువ్వు రెడీగా అయ్యావు వెళ్లి సినిమా తీసుకో) అని ఆశీర్వదించి నన్ను సినిమా తియ్యమని పంపించారు’’ అని సూర్య.. లారెన్స్‌కు చెబుతుండడం చూస్తే ఇది పీరియాడిక్ మూవీ అని అర్ధం అవుతోంది. ఇక ఆ తర్వాత కూడా కొన్ని థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలతో ట్రైలర్ సాగింది. ఈ మూవీలో డైరెక్టర్ పాత్రలో ఎస్ జె సూర్య, గ్యాంగ్ స్టర్ పాత్రలో రాఘవ లారెన్స్ నటించగా 1975లో జరిగిన కథగా ఈ ప్రీక్వెల్ తెరకెక్కించారు. తెలుగు నటుడు నవీన్ చంద్ర, మలయాళ నటుడు షైన్ టామ్ చాకోలు విలన్ పాత్రలో కనిపించగా ‘‘ఈ రోజుల్లో మంచోళ్లపై సినిమా తీస్తే ఎవరూ చూడరమ్మ’’ అని సూర్య అనడం హాట్ టాపిక్ అయ్యేలా ఉంది. ‘‘రే సార్, నా స్వీయ చరిత్రను కాస్త మార్చి రాద్దామా’’ అని లారెన్స్ అంటే ఇక్కడ ఎవరు ఏదీ కొత్తగా రాయలేరు. కలం గట్టిగా పట్టుకుంటే చాలు, రాయబడిందే రాయబడుతుంది’’ అని సూర్య అంటాడు. ఇక ఆసక్తి రేకెత్తిస్తున్న ఈ మూవీని తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో నవంబరు 10న విడుదల చేస్తున్నారు మేకర్స్.

Exit mobile version