Siya Gowtham:’నేనింతే’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శియా గౌతమ్ ఆ తర్వాత కూడా మూడు నాలుగు సినిమాలలో నటించింది. అయితే బ్రేక్ మాత్రం రాలేదు. మొన్నటి వరకూ దాదాపు 75 కేజీల బరువున్న ఈ అందాల భామ ఇటీవల విగరస్ గా వర్కౌట్స్ చేసి 54 కేజీలకు వచ్చేసింది. దాంతో అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వెళుతున్నాయి. తాజాగా తెలుగులో శియా గౌతమ్ ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ చేయబోతోంది.
కెఎల్ఎన్ క్రియేషన్స్ క్రియేటివ్ క్యారెక్టర్స్ సమర్పణలో ప్రొడక్షన్ నెంబర్ 1 గా ఇది నిర్మితం కాబోతోంది. ఈ సినిమాకు ‘మరో మహా భారతం’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. దసరా రోజున ఈ లేడీ ఓరియంటెడ్ మూవీ పూజా కార్యక్రమాలు జరుగబోతున్నాయి. జగదీష్ దూగాన దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ మూవీని లక్ష్మీ నారాయణ కిల్లి, రామకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఫస్ట్ లుక్ ను అక్టోబర్ 5న విడుదల చేస్తారు. మూవీ రెగ్యులర్ షూటింగ్ నవంబర్ మొదటివారంలో ప్రారంభమౌతుంది.
