NTV Telugu Site icon

Sivaji: శివాజీ భార్యను చూశారా.. భలే అందంగా ఉందే

Sivaji

Sivaji

Sivaji: నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి హీరోగా మారి.. మంచి మంచి సినిమాల్లో నటించి మెప్పించాడు. దాదాపు 90పైగా సినిమాల్లో నటించిన శివాజీకి నటుడుగా మంచి పేరే ఉంది. కానీ.. రాజకీయాల్లోకి వచ్చాక శివాజీ కొద్దిగా నీడ్ నేమ్ తెచ్చుకున్నాడు. ఇక కొన్నేళ్లుగా సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శివాజీ.. బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టాడు. మొదటి నుంచి కూడా హౌస్ లో పెద్దన్న గా ఉంటూ తనదైన గేమ్ తో టాప్ 1 లో నిలుస్తున్నాడు. ఇక ఇప్పటివరకు శివాజీ పర్సనల్ లైఫ్ ఎప్పుడు బయటపడలేదు. తన భార్య, పిల్లలు ఇప్పటివరకు మీడియా ముందుకు వచ్చింది లేదు. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాకా శివాజీ కుటుంబం బయటకు వచ్చారు. మొన్న ఫ్యామిలీ వీక్ లో శివాజీ పెద్ద కొడుకు వచ్చాడు. ఇక ఈరోజు శివాజీ భార్య, చిన్న కొడుకు వచ్చారు. నా చిన్న కొడుకు రింకీ కోసమే బిగ్ బాస్ కు వచ్చాను అని చెప్పిన శివాజీ.. ఈరోజు స్టేజిపై శివాజీ భార్య శ్వేత కనిపించింది. ఆమె శివాజీని చాలా మిస్ అవుతున్నాను అని చెప్పుకొచ్చింది. ఇక శివాజీ ఎమోషనల్ అవుతూ.. ఇప్పటివరకు తనను ఏరోజు కెమెరా ముందుకు తీసుకురాలేదని చెప్తూనే కొడుకు చెప్పే విషయాలను చెప్పి నవ్వేశాడు.

Kajal Agarwal : బిగ్ బాస్ లో సందడి చేసిన కాజల్.. వైరల్ అవుతున్న పిక్స్..

శివాజీ భార్య శ్వేత చూడడానికి చాలా అందంగా ఉంది. ఆమెను చూసిన శివాజీ ఫ్యాన్స్ వదినా అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక “మాది లవ్ మ్యారేజ్. లవ్ అంటే ఏదో బయట తిరిగి పెళ్లి చేసుకున్నది ఏం కాదు. మేం లవ్ చేసుకుని పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. ఓ ఫంక్షన్‌లో ఇద్దరం కలుసుకున్నాం.. మాట్లాడుకున్నాం.. ఇష్టపడ్డాం.. ఆ తరువాత మా ఫ్యామిలీ వాళ్ల ఫ్యామిలీ మాట్లాడుకున్నారు. పెళ్లి చేసుకున్నాం. నా భార్యకి అసలు షూటింగ్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. ఫస్ట్‌లోనే షూటింగ్‌లకు రాకూడదని కండిషన్ పెట్టాను. తన లోకం తనది. సినిమాలు షూటింగ్‌లను పట్టించుకోదు. నేను కట్నం తీసుకోలేదు. నా పెళ్లి కూడా నా ఖర్చులతోనే చేసుకున్నాను” అని ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments