Sivaji: నటుడు శివాజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ సీజన్ 7 తరువాత అందరికీ శివాజీ ఫేవరేట్ గా మారిపోయాడు. ఇక హూసు నుంచి బయటకు వచ్చాకా తనకు పరిచయం ఉన్న పెద్దలను కలవడం మొదలుపెట్టాడు. ఒకపక్క పల్లవి ప్రశాంత్, యావర్ లతో కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ తీస్తాను అని చెప్పుకొచ్చాడు. ఇంకోపక్క ఆయన నటించిన #90’s వెబ్ సిరీస్ రిలీజ్ కు సిద్దమవుతుంది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో శివాజీ బిజీగా మారాడు. ఇక తాజాగా ఈరోజు శివాజీ.. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనును కలిశాడు. మర్యాదపూర్వకంగా కలిసి ఆయనకు శివాజీ బొకే అందించాడు. అనంతరం వీరిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక వీరి కలయిక ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అందుకు కారణం వీరిద్దరూ సీఎం జగన్ కు యాంటీగా ఉండడమే. బోయపాటి మొదటి నుంచి టీడీపీ సపోర్టర్ గానే ఉంటున్నాడు. ఇంకోపక్క శివాజీ ఎన్నోసార్లు జగన్ కు యాంటీగా ఉంటున్నట్లు తెలిపాడు. ఇక కొన్నిరోజుల్లో ఏపీ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో వీరిద్దరూ కలవడం అనేది ఆసక్తిగా మారింది. వీరు దేనికి కలిశారు అనేది మిస్టరీగా మారింది. ఇకపోతే బోయపాటి కెరీర్ విషయానికొస్తే.. స్కంద యావరేజ్ గా నిలిచింది. దీని తరువాత బోయపాటి అధికారికంగా ఏ సినిమాను ప్రకటించలేదు కానీ, అఖండ 2 ను సెట్స్ మీదకు తీసుకెళ్తున్నట్లు సమాచారం. మరి ఈ సినిమాలో ఏమైనా శివాజీ నటిస్తాడేమో చూడాలి.
