Site icon NTV Telugu

Prince: కోలీవుడ్ హీరోను ‘ప్రిన్స్’ అంటున్న ‘జాతిరత్నం’ డైరెక్టర్

Prince

Prince

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ అటు తమిళ్ లోనే కాకుండా తెలుగులోనూ అభిమానులను సంపాదించుకున్నాడు. ‘రెమో’ వంటి డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న శివ కార్తికేయన్ ఈ సినిమా తరువాత తన సినిమాలన్నింటిని తెలుగులో రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. ఇక తాజాగా హీరో తెలుగులో డైరెక్ట్ గా అడుగుపెట్టబోతున్నాడు. ‘జాతిరత్నాలు’ చిత్రంతో స్టార్ డైరెక్టర్ హోదా సంపాదించుకున్న అనుదీప్ కెవి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో మొట్టమొదటి సారి ఒక ఉక్రెయిన్ హీరోయిన్ మరియా ర్యాబోష్పక శివకార్తికేయన్ సరసన నటిస్తోంద.

ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టైటిల్ ను తెలుపుతూ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు ప్రిన్స్ అనే టైటిల్ ను ఖరారు చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పోస్టర్ లో శివకార్తికేయన్ నిజంగానే ప్రిన్స్ లో కనిపిస్తున్నాడు. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో చేతిలో గ్లోబును పట్టుకొని నవ్వుతూ కనిపించాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ నెట్టింట వైరల్ గా మారింది. పోస్టర్ చూస్తుంటే డిఫరెంట్ కథతో అనుదీప్ వస్తున్నట్లు అనిపిస్తుంది. మరి ఈ సినిమా శివ కార్తికేయన్ ను తెలుగులో స్టార్ గా నిలబడుతుందా..? లేదా అనేది చూడాలి.

Exit mobile version