Site icon NTV Telugu

Sithara: 50 ఏళ్లయినా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయిన నటి.. అతని ప్రేమ కోసమే?

Sithara Sad Love Story

Sithara Sad Love Story

Sithara Reveals Why She Was not Married Yet: సితార అనగానే ఈ జనరేషన్ వాళ్ళకి మహేష్ బాబు కుమార్తె గుర్తుకొస్తుంది. కానీ ఆ పేరుతో ఒక సీనియర్ నటీమణి ఉంది. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో అనేక సినిమాలు చేసి మంచి గుర్తింపు సంపాదించింది. కన్నడలో విష్ణువర్ధన్ హీరోగా నటించిన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ ఇలా భాషా భేదం లేకుండా తల్లిగా అత్తగా పిన్నిగా చెల్లిగా రకరకాల క్యారెక్టర్లు చేస్తూ మంచి గుర్తింపు సంపాదించింది. అయితే గత కొంత కాలంగా ఆమె సినిమాలకు దూరంగా తన పర్సనల్ లైఫ్ కి ఇంపార్టెన్స్ ఇచ్చింది. పూర్తిగా సినిమాలకు దూరమైపోయింది. తాజాగా ఆమె ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. అయితే ఆ ఇంటర్వ్యూలో 50 ఏళ్ల వయసులో కూడా ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదనే ప్రశ్న ఆమెకు ఎదురయింది.

Sreeja Konidela: ఫైనల్లీ మౌనం వీడిన చిరు చిన్న కూతురు.. అదే సమాధానం అంటూ ఎమోషనల్!

అయితే దానికి ఆమె ఒక షాకింగ్ సమాధానం చెప్పింది అదేంటంటే సినీ పరిశ్రమలో టాప్ స్టార్ గా ఉన్న సమయంలోనే తాను ఒకరిని ప్రేమించానని అయితే తనకు అదృష్టం లేకపోవడంతో ఆ ప్రేమ ఎక్కువ కాలం నిలవలేదని ఆమె వాపోయింది. మా ప్రేమ నిలవలేదు కానీ నేను ఇప్పటికీ అతని గురించి ఆలోచించని రోజు లేదు, నాకు అతనితో ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. కాబట్టి వేరే ఎవరినో పెళ్లి చేసుకోవాలని ఆలోచన నాకు రాలేదు. అందుకే పెళ్లి చేసుకోకుండా ఉండిపోయానంటూ ఆమె చెప్పుకొచ్చింది. అలాగే తన తల్లిదండ్రులను వదిలి తాను ఉండలేను కాబట్టి వివాహం జోలికి వెళ్లదలచుకోలేదని కూడా ఆమె సమాధానం చెప్పింది. మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన స్నేహం కోసం సినిమాలో విజయ్ చందర్ పెద్ద కుమార్తెగా నటించిన ఆమెకు తెలుగులో మంచి గుర్తింపు లభించింది.

Exit mobile version