Sita Kalyana Vaibhogame Teaser : సుమన్ తేజ్, గరీమ చౌహన్ హీరో హీరోయిన్లుగా ‘సీతా కళ్యాణ వైభోగమే’ అనే సినిమా తెరెక్కుతోంది. డ్రీమ్ గేట్ ప్రొడక్షన్స్ పతాకంపై సతీష్ పరమవేద దర్శకత్వంలో రాచాల యుగంధర్ నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ 26న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. ఈ మేరకు సినిమా యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాలు పెంచేసింది. తాజాగా ఈ మూవీ టీజర్‌ను మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతుల మీదుగా విడుదల చేయించారు. నల్ల నల్ల నీళ్లలోనా తెల్లని చేప అంటూ బ్యాక్ గ్రౌండ్‌లో పాట హీరో హీరోయిన్ల పరిచయం, గ్రామీణ వాతావరణం, ఊరి అందాలను ఓపెన్ చేస్తూ టీజర్‌ను ప్రారంభించారు. ఇక ఆ తరువాత గోవాకు లొకేషన్ మార్చేశారు.
Duvvada Srinivas vs Duvvada Vani: భర్తపై ఇండిపెండెంట్‌గా బరిలోకి భార్య..! ఇలా స్పందించిన దువ్వాడ..
అటుపై యాక్షన్ సీక్వెన్స్‌ను, గగన్ విహారి విలనిజాన్ని చూపించడం జరిగింది. ఇక ‘నా పెళ్లాం లేచిపోయింది.. సీత నాది’ అంటూ విలన్ చెప్పిన డైలాగ్స్, చేజింగ్, యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకోగా ‘సీతమ్మ లేని గుడి రాముడి గుడే కాదు.. గుడిని మూసేయండి’ అని చెప్పే డైలాగ్.. ఆ తరువాత చూపించిన యాక్షన్ సీక్వెన్స్, హీరో వీరోచిత పోరాటాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ‘సీత ఎప్పటికీ రాముడిదే’ అంటూ టీజర్ చివర్లో హీరో చెప్పిన డైలాగ్ కూడా ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ టీజర్‌ను రిలీజ్ చేసిన అనంతరం మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ‘టీజర్ చాలా బాగుంది. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్. ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించాల’ని కోరుకున్నారు. ఈ మూవీ కుటుంబ సమేతంగా చూసేలా ఉందని, ఏప్రిల్ 26న ఈ చిత్రం భారీ స్థాయిలో విడుదల కానుందని అన్నారు.