NTV Telugu Site icon

SIT Movie: జీ5 టాప్ 5లో ట్రెండ్ అవుతున్న SIT!

Sit Movie

Sit Movie

SIT Movie Trending in Top 5 in Zee 5: అరవింద్ కృష్ణ, నటాషా దోషి హీరో హీరోయిన్లుగా విజయ భాస్కర్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం S.I.T (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం). ఈ సినిమాను నాగిరెడ్డి, తేజ పల్లి, శ్రీనివాస్ రెడ్డి నిర్మించారు. ఈ మూవీ మే 10 నుంచి జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమా క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ ఆడియెన్స్‌ని ఓటీటీలో బాగానే ఆకట్టుకుంటోంది. ఈ మూవీకి మంచి ఆదరణ వస్తుండటంతో దర్శకుడు విజయ భాస్కర్ రెడ్డి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంపీఏ చేశా, ఆ తరువాత ఇండస్ట్రీలోకి వచ్చా, అసిస్టెంట్, కో డైరెక్టర్‌గా వివిద దర్శకుల వద్ద పని చేశా. SIT మూవీతో దర్శకుడిగా పరిచయం అయ్యా. సినిమాల్లోకి రావడం నా ఫ్యామిలీకి ఇష్టం లేదు కానీ పదిహేనేళ్ల పాటు ఇండస్ట్రీలో కొనసాగుతున్నా.

Naga Chaitanya: తండేల్ కోసం తొమ్మిది నెలలు.. సీక్రెట్స్ బయటపెట్టిన చైతూ

నా డిగ్రీ ఫ్రెండ్స్ ఫండింగ్ చేస్తుండటంతో ఈ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఈ కథను వెబ్ సిరీస్ కంటే సినిమా తీస్తే బాగుంటుందని అన్నారు. అరవింద్ కృష్ణ అద్భుతంగా నటించారు, ఆయన సహకారం ఎప్పటికీ మర్చిపోలేను. నటాషా చక్కగా నటించారు. నటీనటులు, టెక్నీషియన్ల సహకారంతోనే ఈ మూవీని ఇంత బాగా తీయగలిగాను. ఇది ఓటీటీ కంటెంట్ కాబట్టి.. ముందు నుంచి కూడా మేం ఓటీటీ కోసమే ప్రయత్నాలు చేశాం. చివరకు మా సినిమా ఓటీటీలోకి వచ్చిది. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. రెండో పార్ట్ ఎప్పుడు, మూడో పార్ట్ ఎప్పుడు? అని అంతా అడుగుతున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా రీచ్ అయిందని తెలుస్తోంది. జీ5లో ప్రస్తుతం మా చిత్రం టాప్ 5లో ట్రెండ్ అవుతోంది. చాలా ఆనందంగా ఉందని అన్నారు.

Show comments