Site icon NTV Telugu

Sirish Bharadwaj: చిరంజీవి మాజీ అల్లుడు శిరీష్ భరద్వాజ్ మృతి

Sirish Bharadwaj Passed Away

Sirish Bharadwaj Passed Away

Sirish Bharadwaj Passed Away: మెగాస్టార్ చిరంజీవి రెండో కుమార్తె శ్రీజను ప్రేమించి వివాహం చేసుకొని ఆ తర్వాత విడాకులు తీసుకున్న శిరీష్ భరద్వాజ్ తాజాగా కన్నుమూశాడు. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజను శిరీష్ భరద్వాజ్ ప్రేమించి పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. 2007లో వీరి వివాహం జరిగింది. అప్పట్లో ఈ వివాహం పెను సంచలనానికి కేంద్ర బిందువుగా మారింది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. అదనపు కట్నం కోసం శిరీష్ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని శ్రీజ పోలీసులకు సైతం ఫిర్యాదు చేసింది.

Darshan: నటుడు దర్శన్‌కి మరో టెన్షన్.. ఇంటిని కూల్చేసే యోచనలో సర్కార్?

ఈ క్రమంలోనే 2014లో వారికి విడాకులు అయ్యాయి. ఆ తర్వాత శ్రీజ కళ్యాణ్ దేవ్ ని 2016లో వివాహం చేసుకున్నారు. ఇక శిరీష్ శ్రీజ జంటకు ఒక పాప ఉండగా విడిపోయిన తర్వాత పాప శ్రీజ దగ్గరే పెరుగుతుంది. ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టిన శిరీష్ బీజేపీలో చేరి కొంత యాక్టివ్ అయ్యారు. 2019లో ఆయన రెండో వివాహం చేసుకున్నారు. ఇక తాజాగా ఆయన అనారోగ్య కారణాలతో కన్ను మూసినట్లు సమాచారం అందుతోంది. లంగ్స్ డామేజ్ కావడంతో ఆయన ఆసుపత్రి పాలయ్యారు. ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటూ ఆయన కన్నుమూసినట్లు తెలుస్తోంది. ఇక దానికి సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలియాల్సి ఉంది.

Exit mobile version