Siri Hanmanth: ఇన్‌స్టాగ్రామ్ పెయిడ్ సబ్‌స్క్రిప్షన్ బాటలో మరో బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టెలివిజన్ నటి, యూట్యూబర్ సిరి హన్మంతు సోషల్ మీడియా వేదికగా సరికొత్త ఆదాయ మార్గానికి తెరలేపారు. ‘జబర్దస్త్’ షోతో కెరీర్ మొదలుపెట్టి, బిగ్‌బాస్ తెలుగు సీజన్-5తో పాపులారిటీ సంపాదించుకున్న ఈ బ్యూటీ, ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో ‘పెయిడ్ సబ్‌స్క్రిప్షన్’ (Paid Subscription) ఫీచర్‌ను ప్రారంభించి తన అభిమానులకు షాకిచ్చారు. సెలబ్రిటీలు సోషల్ మీడియాను కేవలం పబ్లిసిటీ కోసమే కాకుండా, పక్కా కమర్షియల్ ఆదాయ వనరుగా మార్చుకుంటున్న క్రమంలో సిరి వేసిన ఈ అడుగు ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది.
సిరి షేర్ చేసే ఎక్స్‌క్లూజివ్ ఫోటోలు, షూటింగ్ బిహైండ్ ద సీన్స్, ఆమె పర్సనల్ లైఫ్ అప్‌డేట్స్ చూడాలంటే నెటిజన్లు నెలకు రూ. 449 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఈ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి మాత్రమే స్పెషల్ లైవ్ సెషన్లు, ప్రాధాన్యతతో కూడిన రిప్లైలు అందుతాయని ఆమె వెల్లడించారు. గతంలో యాంకర్ విష్ణుప్రియ ఇలాంటి ప్రయత్నం చేసి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ, సిరి మాత్రం తన వీరాభిమానుల కోసం ఈ ‘వీఐపీ యాక్సెస్’ను అందుబాటులోకి తెచ్చారు. దీనిపై సోషల్ మీడియాలో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు ఆమె వ్యాపార దృక్పథాన్ని మెచ్చుకుంటుంటే, మరికొందరు మాత్రం సోషల్ మీడియాలో కూడా ఇలాంటి వసూళ్లు ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Sundeep Kishan: ‘సిగ్మా’పై కుట్రల వెనకుండి నడిపిస్తున్నది ఎవరో తెలుసు.. దొరికిపోతే మీకే ఎక్కువ నష్టం
- Mohan Babu: ఆ కష్టాలు నువ్వు పడలేవు నాని.. ఇండస్ట్రీ స్ట్రగుల్‌పై మోహన్ బాబు షాకింగ్ కామెంట్స్!
- Sumalatha: ఫిల్మ్ ఛాంబర్ మీట్.. జానీమాస్టర్ భార్య సుమలత హల్చల్.. వైరల్ అవుతున్న వీడియో!
- Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?