NTV Telugu Site icon

Actor Ravindra Berde: ‘సింగం’ నటుడు కన్నుమూత

Ravindra Berde Death

Ravindra Berde Death

Singham Fame Actor Ravindra Berde Passes Away At 78 : బుధవారం హిందీ సినీ ప్రపంచానికి మరో షాక్ తగిలింది. ‘సింగం’, ‘నాయక్’ లాంటి సినిమాలకి పని చేసిన ప్రముఖ నటుడు రవీంద్ర బెర్డే కన్ను మూశారు. ఆయన వయసు 78 ఏళ్లు. ‘సిఐడి’ ఫేమ్ దినేష్ ఫడ్నిస్, జూనియర్ మెహమూద్ తర్వాత సినిమా – టివి పరిశ్రమకు ఇది వరుసగా మూడో మరణం. ఈ ముగ్గురు నటులు కూడా మరాఠీ చిత్ర పరిశ్రమలో అంతర్భాగమైన వారే. ఆయన ప్రముఖ నటుడు దివంగత లక్ష్మీకాంత్ బెర్డే సోదరుడు. అందుతున్న సమాచారం ప్రకారం, రవీంద్ర గత కొన్ని నెలలుగా గొంతు క్యాన్సర్ చికిత్స కోసం ముంబైలోని టాటా ఆసుపత్రిలో చేరారు. డిసెంబరు 13న, చికిత్స పొందుతూ, ఆయన గుండెపోటుకు గురయ్యాడు, ఈ కారణంగా ఆయన మరణించాడు.

Fatima Vijay Antony: ఈ క్షణం నుంచి దేవుడు లేడు, ఆయన్ని నమ్మితే అంతే.. విజయ్ ఆంటోనీ భార్య షాకింగ్ ట్వీట్!

రవీంద్ర బెర్డే ‘నాయక్: ది రియల్ హీరో’లో అనిల్ కపూర్‌తో కలిసి కనిపించారు. రోహిత్ శెట్టి ‘సింగం’ సినిమాలో కూడా ఆయన ప్రధాన పాత్రలో ఉన్నాడు. హిందీతో పాటు పలు మరాఠీ సినిమాలకు కూడా పనిచేశాడు. ‘మహారాష్ట్ర టైమ్స్’ కథనం ప్రకారం, రవీంద్ర బెర్డే, రెండు రోజుల క్రితమే ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యారు. అయితే బుధవారం ఉదయం అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించినా ప్రాణాలను కాపాడలేకపోయారు. రవీంద్ర బెర్డేకు భార్య, ఇద్దరు పిల్లలు, కోడలు, మనవడు ఉన్నారు. రవీంద్ర బెర్డే తన కెరీర్‌లో 100కు పైగా సినిమాల్లో నటించారు. రోహిత్ శెట్టి మొదటి ‘సింగం’లో అజయ్ దేవగన్‌తో కలిసి కనిపించాడు. ఈ సినిమాలో అతని పాత్ర పేరు జమీందార్ చంద్రకాంత్.