Trisha: త్రిషను ‘పరాన్నజీవి’తో పోల్చుతూ..సింగర్ సుచిత్ర సంచలన వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ పరిశ్రమలో ‘సుచి లీక్స్’ ద్వారా ఒకప్పుడు సంచలనం సృష్టించిన సింగర్ సుచిత్ర, తాజాగా ఒక ఇంటర్వ్యూలో నటి త్రిషపై విమర్శల వర్షం కురిపించారు. త్రిషను ‘పరాన్నజీవి’ (Parasite) అంటూ సంబోధించడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా దళపతి విజయ్ వ్యక్తిగత జీవితం గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి.
“నాకు త్రిష అంటే అస్సలు ఇష్టం లేదు. విజయ్ అంటే నాకు చాలా గౌరవం ఉంది, అందుకే నిష్పక్షపాతంగా మాట్లాడుతున్నాను” అని సుచిత్ర పేర్కొన్నారు. విజయ్ ప్రస్తుతం తన తల్లిదండ్రులకు, భార్య సంగీతకు దూరమై ఒంటరిగా ఉండటానికి త్రిషతో ఏర్పడిన సాన్నిహిత్యమే కారణమని ఆమె ఆరోపించారు. విజయ్ లాంటి స్టార్ ఇలాంటి పరిస్థితుల్లో ఉండటం బాధాకరమని, ఒక వ్యక్తి బలహీనంగా ఉన్న సమయంలోనే ఇటువంటి వారు ప్రవేశించి జీవితాలను ప్రభావితం చేస్తారని ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సుచిత్ర చేసిన ఈ వ్యాఖ్యలపై త్రిష, విజయ్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు.
Also Read
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక స్టార్ హీరోయిన్ వ్యక్తిత్వాన్ని కించపరచడం సరికాదని నెటిజన్లు మండిపడుతున్నారు. త్రిష ప్రస్తుతం కెరీర్ పరంగా వరుస విజయాలతో దూసుకుపోతున్న తరుణంలో, ఇలాంటి పాత వివాదాలను లేదా వ్యక్తిగత విషయాలను తెరపైకి తీసుకురావడం కేవలం పబ్లిసిటీ కోసమేనని కొందరు విమర్శిస్తున్నారు. గతంలోనూ సుచిత్ర పలువురు స్టార్లపై ఇలాంటి ఆరోపణలే చేసిన సంగతి తెలిసిందే.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?