Site icon NTV Telugu

Rahul Sipligunj : టీడీపీ నేత కూతురిని పెళ్లాడబోతున్న సింగర్ రాహల్ సిప్లిగంజ్

Rahul Sipligunj

Rahul Sipligunj

టాలీవుడ్ ప్రముఖ సింగర్  రాహుల్ సిప్లిగంజ్ పరిచయం అక్కర్లేని పేరు. ఎన్నో సూపర్ హిట్స్ సాంగ్స్ ను ఆలపించిన రాహుల్ RRR సినిమాలోని నాటు నాటు పాటతో ఆస్కార్ అవార్డు అందుకుని అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగు పాపులర్ షో బిగ్ బాస్ తోను తనకంటూ అభిమానులను సంపాదించుకున్నాడు రాహుల్. ఓ వైవు సినిమా సాంగ్స్ మరోవైపు స్పెషల్ సాంగ్స్ తో బిజిగా ఉన్న రాహుల్ తన ఫ్యాన్స్ కు సప్రయిజ్ ఇచ్చాడు.

Also Read : Tollywood Bandh : 50 ఏళ్ల కిందటి యూనియన్ రూల్స్ తో ఇప్పుడు సినిమాలు తీయలేరు

మోస్ట్ ఎలిజిబిల్ బ్యాచిలర్ సింగర్ గా ఉన్న రాహుల్ ఇప్పుడు సింగిల్ లైఫ్ కు సెండాఫ్ ఇస్తూ ఒకింటి వాడు అయ్యాడు. అయితే రాహుల్ చేసుకోబోతున్న అమ్మాయి ఎవరు అని ఆరాలు తీయగా ఆసక్తికర విషయాలు తెలిశాయి. రాహుల్ నిర్మించిన అనేక సాంగ్స్ కు హారణ్య రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. అలాగే హారణ్య రెడ్డి రాజకీయ కుటుంబ నేపధ్యం నుండి వచ్చింది.  టీడీపీ నెల్లూరు నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి అన్న కూతురే హారణ్య రెడ్డి.  కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న ఈ జంట పెళ్ళికి ఇరు కుటుంబాలు అగీకారం తెలిపాయి. ఈ నేపథ్యంలోఆగస్టు 17 ఆదివారం నాడు హైదరాబాద్ లోని ITC కోహినూర్ హెటల్ లో  ఇరు   కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది సన్నిహితులు,చిత్ర, రాజకీయ ప్రముఖుల సమక్షంలో రాహుల్- హారణ్యల నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. వీరి ఎంగేజ్మెంట్ కి సంబంధించి టీడీపీ నేతకోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఈ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు.

Exit mobile version