Site icon NTV Telugu

కరోనా నుంచి కోలుకుంటున్న లతా మంగేష్కర్.. కానీ..?

latha mangeshkar

లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ కరోనా బారిన పడి స్వల్పంగా కోలుకున్నారు. కానీ ఇంకా ఆమె ఐసీయూలోనే ఉన్నారు. ఆమెకు వెంటిలేటర్ తొలగించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. వెంటిలేటర్ లేకుండా ఆమె ఆరోగ్య పరిస్థితిని అంచనా వేసేందుకు ఈ ఉదయం కొంచెం సేపు వైద్యులు వెంటిలేటర్ తొలగించారు. దీంతో లతా మంగేష్కర్ కోలుకుంటున్న సూచనలు కనిపిస్తున్నాయని ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు. లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిని అనుక్షణం వైద్యులు గమనిస్తున్నారని పేర్కొన్నారు.

Read Also: మెగాస్టార్ చిరంజీవికి ఫోన్ చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్

కాగా లతా మంగేష్కర్‌కు కరోనా పాజిటివ్ రావడంతో ఈ నెల 8న ఆమె ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి ఆమె ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించిందని ప్రచారం జరిగినా.. ఆమె కుటుంబ సభ్యులు ఖండించారు. అప్పటి నుంచి ఆసుపత్రి వైద్యులు క్రమం తప్పకుండా లతా మంగేష్కర్ ఆరోగ్య పరిస్థితిని వెల్లడిస్తున్నారు.

Exit mobile version