Site icon NTV Telugu

Ajay Devgn: మరో సింగం సినిమా వస్తోంది…

Ajay Devgn

Ajay Devgn

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సీక్వెల్స్, ఫ్రాంచైజ్ సినిమాలు పెద్దగా ఆడవు. సీరీస్ లో వచ్చే సినిమాలని ఇండియన్ ఆడియన్స్ యాక్సెప్ట్ చెయ్యరు, ఫస్ట్ పార్ట్ మాత్రమే హిట్ అవుతుంది మిగిలిన సినిమాలు గోవింద కొడతాయి అనే భ్రమలో చాలా మంది ఫిల్మ్ మేకర్స్ ఉన్న సమయంలో సరైన కంటెంట్ తో సినిమా చేస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు అని నిరూపించారు ‘రోహిత్ శెట్టి-అజయ్ దేవగన్’. ఈ హీరో డైరెక్టర్ కాంబినేషన్ లో ముందుగా ‘గోల్మాల్’ ఫ్రాంచైజ్ వచ్చి సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఒక కామెడీ ఫ్రాంచైజ్ వందల కోట్ల కలెక్షన్స్ ని రాబట్టగలదు అని నిరూపించారు రోహిత్ శెట్టి-అజయ్ దేవగన్. కామెడి ఫ్రాంచైజ్ తోనే ఆడియన్స్ ని మెప్పించిన వాళ్లకి యాక్షన్ సినిమాలతో అట్రాక్ట్ చెయ్యడం కష్టమా? చాలా ఈజీ కదా. ఈ మాటనే నిజం చేసింది ‘సింగం సిరీస్’.

సింగం 1 సౌత్ సినిమా అయిన యముడు మూవీకి రీమేక్ గా తెరకెక్కి సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీలో అజయ దేవగన్ ‘బాజీరావ్ సింగం’ క్యారెక్టర్ చేసి యాక్షన్ మోడ్ లోకి దిగాడు. ఆ తర్వాత సింగం రిటర్న్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దీని తర్వాత రోహిత్ శెట్టి-అజయ్ దేవగన్ లు ‘సింగం సిరీస్’ని టచ్ చెయ్యలేదు. ఈ సీరీస్ లో సినిమా ఎప్పుడు వస్తుందా అని సినీ అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేశారు. ఈ సమయంలో రోహిత్ శెట్టి, అక్షయ్ కుమార్ తో కలిసి ‘సూర్యవన్షీ’ సినిమా చేశాడు. ఈ మూవీ క్లైమాక్స్ లో అజయ్ దేవగన్ ని సింగం గెటప్ లో మళ్లీ చూపించిన రోహిత్ శెట్టి, సింగం 3కి లీడ్ ఇచ్చాడు. సూర్యవన్షీ సినిమా చూసి థియేటర్స్ నుంచి బయటకి వచ్చిన వాళ్ళలో ఎక్కువ మందికి ‘సింగం 3’ సినిమా అప్డేట్ మాత్రమే గుర్తుండి ఉంటుంది అంటే, సూర్యవన్షీ క్లైమాక్స్ లో అజయ్ దేవగన్ ఇచ్చిన ఇంపాక్ట్ ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు. సూర్యవన్షీ సినిమా ఎండ్ లో సింగం 3కి ఇచ్చిన లీడ్ ని నిజం చేస్తూ అజయ్ దేవగన్, రోహిత్ శెట్టిలు కలిసి ‘సింగం అగైన్’ పనులు మొదలుపెట్టారు. కొత్త సంవత్సరం స్టార్ట్ అయిన సమయంలో ‘సింగం అగైన్’ కథని వినడం కిక్ ఇచ్చింది, ఇది మా కాంబినేషన్ లో 11వ హిట్ అవుతుంది’ అంటూ అజయ్ దేవగన్ ట్వీట్ చేశాడు. దీంతో సింగం సీరీస్ నుంచి మూడో సినిమా వస్తుంది అనే వార్త అఫీషియల్ అయ్యింది.

Exit mobile version