Site icon NTV Telugu

ఆగస్టులో ‘సింగం 4’ షూటింగ్.. కథానాయికగా?

సుధ కొంగర దర్శకత్వంలో ఇటీవల ‘ఆకాశమే నీ హద్దురా’ సినిమాతో సూపర్ హిట్ సాధించాడు సూర్య. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెట్టాడు. ఇదిలావుంటే, సూర్య కెరీర్ లో వచ్చిన ‘సింగం’ సిరీస్ గూర్చి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హరి దర్శకత్వంలో చాలాకాలం క్రితం వచ్చిన ‘సింగం’ భారీ విజయాన్ని సాధించింది. సూర్య కెరియర్లోనే అత్యధిక వసూళ్లను రాబట్టింది. కాగా మరోసారి సూర్య, హరి కాంబినేషన్‌లో ఈ సిరీస్‌లో ‘సింగం 4’ తెరకెక్కించడానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. కరోనా పరిస్థితులు చక్కబడితే ఆగస్టు నుంచి చిత్రీకరణ మొదలుపెట్టాలని సన్నాహాలు చేస్తున్నారట. సూర్య సరసన అనుష్క శెట్టి నటించనుందని తెలుస్తోంది.

Exit mobile version