Site icon NTV Telugu

Concept Poster: గ్యాంగ్ స్టర్ కథతో ‘సిన్స్ 1975’!

Since 1975

Since 1975

 

Concept Poster ఒకప్పటి గ్యాంగ్‌స్టర్ కథ ఆధారంగా అభిలాష్, రోహి నయన్ హీరోహీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘సిన్స్ 1975’. సురేంద్ర మాదారపు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బెల్లాన అప్పారావు నిర్మించారు. గడ్డం శిరీష, నల్లపు రవీందర్ సహనిర్మాతలు కాగా, సురేష్ బాబు అట్లూరి లైన్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఈ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ పోస్టర్‌ను తాజాగా చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఈ సందర్భంగా నిర్మాత బెల్లాన అప్పారావు మాట్లాడుతూ.. ”ఒకప్పటి టాప్ గ్యాంగ్‌స్టర్ కథ ఆధారంగా దర్శకుడు సురేంద్ర ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తవడమే కాకుండా.. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా చివరి దశకి చేరుకున్నాయి. కాన్సెప్ట్ పోస్టర్‌ కు చాలా మంచి స్పందన వస్తోంది. త్వరలోనే ఫస్ట్ లుక్‌తో పాటు విడుదల తేదీని కూడా ప్రకటిస్తాం” అని తెలిపారు. చిత్ర దర్శకుడు సురేంద్ర మాదారపు మాట్లాడుతూ, ”రస్టిక్ గ్యాంగ్‌స్టర్ మూవీగా ఈ చిత్రాన్ని రూపొందించాం. రియలిస్టిక్ అప్రోచ్ కోసం అంతా కొత్తవారితో చేయడం జరిగింది. ఈ సినిమాలో చాలా వరకు థియేటర్ ఆర్టిస్ట్‌లనే తీసుకున్నాం. అందరూ అద్భుతమైన నటనను కనబరచడమే కాకుండా ఎంతగానో సహకరించారు. సంగీత దర్శకుడు సాయికార్తీక్‌కు, ఎడిటర్ ప్రవీణ్ పూడికి, ఇతర సాంకేతిక నిపుణులకు, నిర్మాతకు ధన్యవాదాలు. సినిమా చాలా బాగా వచ్చింది” అని అన్నారు.

Exit mobile version