Sinam Releasing As Aakrosham In Telugu: తమిళంలో అరుణ్ విజయ్ నటించిన ‘సినమ్’ సినిమాను విఘ్నేశ్వర ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై జగన్మోహిని సమర్పణలో ఆర్. విజయ్ కుమార్ ‘ఆక్రోశం’ పేరుతో తెలుగువారికి అందిస్తున్నారు. ఈ సినిమాను 9వ తేదీన విడుదల చేయబోతున్నారు. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో పోలీస్ ఇన్ స్పెక్టర్ భార్య రేప్ కు గురై చనిపోతే తను ఎలా హంతకులను వేటాడాన్నదే కథ. జి.ఎన్.ఆర్. కుమరవేలన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో పల్లక్ లల్వానీ కథానాయిక. షాబిర్ సంగీతం అందించారు. తమిళంలో సెప్టెంబర్ 16న విడుదలైన ఈ సినిమా అరుణ్ విజయ్ కెరీర్ లో డిజాస్టర్ ప్లాఫ్ గా నిలిచింది. మరి తమిళంలో ప్లాఫ్ అయిన ఈ సినిమా తెలుగువారిని ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.
Aakrosham: ‘ఆక్రోశం’గా రాబోతున్న అరుణ్ విజయ్ ‘సినమ్’

Senam As Akrosham