Site icon NTV Telugu

Simhadri 4K: కేవలం ఫాన్స్ కి మాత్రమే కాదు… అంతకు మించి

Simhadri 4k

Simhadri 4k

ఈరోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలియదు వాడు ఇండియాలోనే ఉండడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఆ రేంజ్ ఇమేజ్ సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్. ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ సినిమా ఎన్టీఆర్ కి వరల్డ్ మూవీ లవర్స్ ముందు ఎలాంటి ఐడెంటిటీ తెచ్చిందో ఆల్మోస్ట్ అదే రేంజ్ ఐడెంటిటీ అండ్ ఇంపాక్ట్ ని తెలుగు రాష్ట్రాల్లో రెండు దశాబ్దాల క్రితమే క్రియేట్ చేసింది సింహాద్రి సినిమా. రాజమౌళి, ఎన్టీఆర్ ల కాంబినేషన్ లో వచ్చిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ డ్రామా ఆల్ టైం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 175 రోజుల థియేట్రికల్ రన్ ని మైంటైన్ చేసిన సింహాద్రి సినిమా సెకండ్ హాఫ్ కి, సింగమలై టైటిల్ సాంగ్ ని అప్పట్లో థియేటర్స్ ఊగిపోయాయి. 19 ఏళ్ల కుర్రాడు కత్తి పట్టి బాక్సాఫీస్ పై చేసిన స్వైరవిహారంగా సింహాద్రి సినిమా తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ మూవీని యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సంధర్భంగా రీరిలీజ్ చెయ్యడానికి ఫాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. మే 20న ప్రపంచవ్యాప్తంగా సింహాద్రి సినిమాని రీరిలీజ్ చేసిన, రీరిలీజ్ ట్రెండ్ హిస్టరీలోనే ముందెన్నడూ చూడని రికార్డ్స్ ని క్రియేట్ చెయ్యాలని నందమూరి ఫాన్స్ కంకణం కట్టుకోని ఉన్నారు.

సోషల్ మీడియాలో ఇప్పటికే సింహాద్రి సినిమా గురించి ఫాన్స్ హంగామా మొదలయ్యింది. అయితే ఈ మూవీని రీరిలీజ్ చేస్తుంది ఫాన్స్ సంతోషం కోసం మాత్రమే కాదు సంక్షేమం కోసం కూడా అంటున్నారు. సింహాద్రి సినిమాని ఫాన్స్ థియేటర్స్ లో చూస్తే వచ్చే కలెక్షన్స్ ని తెలుగు రాష్ట్రాలలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న ఎన్టీఆర్ ఫాన్స్, ఎవరు ఇబ్బందుల్లో వారిని ఆర్ధికంగా సాయం చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నారు ఫాన్స్. ఏ ఫాన్స్ నుంచి కలెక్షన్స్ వచ్చాయో ఆ ఫాన్స్ కే తిరిగి డబ్బులు ఖర్చు పెట్టాలి అప్పుడే మే 20న రిలీజ్ చెయ్యడానికి ఒక సార్ధకత వస్తుందని ఫాన్స్ నమ్ముతున్నారు. ఈ విషయాన్ని ఫాన్స్ ట్విట్టర్ లో అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. అభిమానంతో పాటు కష్టంలో ఉన్న వాడి అవసరానికి కూడా సాయం చేద్దాం అందరూ సపోర్ట్ చెయ్యండి అంటూ ఫాన్స్ ట్విట్టర్ లో నందమూరి ఫాన్స్ అందరినీ సపోర్ట్ కొరుకుతున్నారు. మరి సింహాద్రి కలెక్షన్స్ ఏ రేంజులో ఉంటాయో చూడాలి.

Exit mobile version