Site icon NTV Telugu

స్టార్ హీరోతో ఇస్మార్ట్ బ్యూటీ పెళ్లి… డేట్ ఫిక్స్ ?

Simbu Nidhhi Agerwal

ఇస్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్, కోలీవుడ్ స్టార్ హీరో శింబు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని గత కొన్ని రోజులుగా గాసిప్స్ హల్ చల్ చేస్తున్నాయి. సినీ పరిశ్రమలోని తాజా నివేదికల ప్రకారం శింబు త్వరలో తన వివాహ తేదీని ప్రకటించవచ్చు. శింబు, నిధి చాలా కాలంగా సహజీవనం చేస్తున్నారని, ఇప్పుడు వారి సంబంధాన్ని ఎట్టకేలకు అధికారికం చేసుకోవడానికి ప్లాన్ చేస్తున్నాఅని తెలుస్తోంది. అయితే ఈ పుకార్లపై శింబు కానీ, నిధి కానీ స్పందించకపోవడంతో వీరి ప్రేమాయణం, పెళ్లిపై క్లారిటీ లేదు. కానీ వీరిద్దరూ 2022లోనే వివాహం చేసుకునే అవకాశం ఉందని సమాచారం. త్వరలో శింబు తన వివాహ వివరాలను అభిమానులు, శ్రేయోభిలాషుల కోసం ప్రకటించనున్నారు అంటున్నారు.

Read Also : టీజర్ : ‘మహాన్’ పోరాటం… ప్రామిస్ నిలబెట్టుకోని విక్రమ్

శింబు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌లలో ఒకరు. ఆయన పెళ్లి పుకార్లు ఎప్పుడూ ఇంటర్నెట్‌లో సందడి సి చేస్తూనే ఉంటాయి. ఇద్దరు నటీనటుల అభిమానులు ఈ వార్తలతో చాలా ఉల్లాసంగా ఉన్నారు. ఇప్పుడు ఈ పెద్ద ప్రకటన కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కానీ నిధికి సన్నిహితంగా ఉన్న కొంతమంది ఈ వార్తలను కొట్టిపారేశారు. శింబు, నిధి ‘ఈశ్వరన్‌’లో స్క్రీన్ స్పేస్‌ను పంచుకున్నారు. దీనికి ఒక మోస్తరు స్పందన లభించింది. అయితే ప్రేక్షకులు వారి ఆన్-స్క్రీన్ కెమిస్ట్రీకి మంచి మార్కులు వేశారు.

Exit mobile version