NTV Telugu Site icon

Siddharth: కర్ణాటక వెళ్లి ప్రెస్ మీట్ పెడితే నువ్వు ఎవడ్రా తమిళోడివి గెట్ అవుట్ అన్నారు

Siddharth Speech At Chinna Pre Release Press Meet

Siddharth Speech At Chinna Pre Release Press Meet

Siddharth Responds on Karnataka Bad Incident at Hyderabad: హీరో సిద్ధార్థ్‌ ప్రధాన పాత్రలో నటించిన కొత్త తమిళ సినిమా చిత్తా, దానిని చిన్నా పేరుతో తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఎమోషనల్​గా డ్రామాగా రూపొందిన ఈ చిత్రం గురువారం(సెప్టెంబర్ 28)న తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ అయింది. ఈ నేపథ్యంలోనే సిద్ధార్థ్ కర్ణాటకలో నిర్వహించిన ఓ ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు. అయితే కార్యక్రమం ప్రారంభం అయిన కాసేపటికే కావేరీ నదీ జలాల విషయంలో ఆందోళన చేస్తున్న కొందరు ఆందోళనకారులు అక్కడికి చేరుకుని ప్రెస్‌మీట్‌ ఆపేయాలని తమిళ రాష్ట్రంతో నదీ జలాల విషయంలో వివాదం నెలకొన్న తరుణంలో ఒక తమిళ నటుడు తమ ప్రాంతంలో ప్రెస్‌మీట్‌ నిర్వహించడంపై ఆందోళకారులు అసహనం వ్యక్తం చేశారు. సమావేశాన్ని వెంటనే నిలిపివేసి.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని సూచించగా సిద్దూ అలానే వెళ్ళిపోయాడు.

Pawan Kalyan: మరోసారి పవన్ కళ్యాణ్‌కు తీవ్ర అస్వస్థత.. అసలు ఏమైందంటే?

ఆ తరువాత శివన్న వంటివారు ఆయనకు కన్నడ పరిశ్రమ తరపున క్షమాపణలు చెప్పారు. ఇక తాజాగా హైదరాబాద్ ప్రెస్ మీట్ లో ఈ విషయం గురించి సిద్దార్థ్ స్పందించాడు. ఆయన మాట్లాడుతూ కర్ణాటక వెళ్లి ప్రెస్ మీట్ పెడితే నువ్వు ఎవడ్రా తమిళోడివి గెట్ అవుట్ అన్నారు నన్ను. ఏదో ఒక రోజు ఒక సినిమా నేను తీస్తాను, అమ్మ తోడు ఇంత కన్నా బెటర్ సినిమా నేను తీయలేను అని చెప్పే పరిస్థితి నాకు వస్తుందని సిద్దార్థ్ అన్నారు. ఇక ఆయన అసలు ఈ విషయంలో ఏం జరిగిందో కూడా వివరించారు. ‘చిన్నా’ సినిమా నిర్మాతగా విడుదలకు ముందే నేను ఈ సినిమాను చాలా మందికి చూపించాలని అనుకుని చెన్నైలో కొంతమందికి చూపించా, బెంగుళూరులోని మీడియాకు సినిమాను చూపించాలని ప్లాన్‌ చేశానని అన్నారు. రిలీజ్​కు ముందే 2000 మంది విద్యార్థులకు ఈ సినిమాను చూపించాలనుకున్నా కానీ, బంద్‌ కారణంగా మేం అన్నింటినీ రద్దు చేశాం, అందువల్ల మాకు భారీ నష్టం వాటిల్లిందని అన్నారు. మంచి సినిమాను అక్కడి ప్రజలతో పంచుకోలేకపోయామని కెమెరాల ముందు జరిగిన దాని గురించి నేను మాట్లాడదలచుకోవడం లేదని అన్నారు.

Show comments