NTV Telugu Site icon

Siddharth: ఆమెను చూసి స్టేజిమీదనే కళ్లనీళ్లు పెట్టుకొని.. కాళ్లు పట్టుకున్న సిద్దార్థ్.. ఎవరామె ..?

Siddu

Siddu

Siddharth: బొమ్మరిల్లు హీరో సిద్దార్థ్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కెరీర్ ఎలా మొదలయ్యిందో కూడా అందరికి తెలిసిందే. ఇక ప్రస్తుతం సిద్దు టక్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే టక్కర్ ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నాడు. తెలుగు, తమిళ్ అని లేకుండా వరుస ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు ఇస్తూ బిజీగా మారాడు. చాలా గ్యాప్ తరువాత సిద్దు మీడియాకు కనిపించడంతో ఎక్కడలేని ప్రశ్నలు అన్ని అడిగేస్తున్నారు. ఇక వాటికి తనదైన రీతిలో సమాధానం చెప్పుకొచ్చి షాకులు ఇస్తున్నాడు సిద్దు. ఇక తాజాగా ఒక తమిళ్ ఇంటర్వ్యూలో సిద్ధుకే ఒక షాక్ ఇచ్చారు ఆ ఛానెల్ వారు. తనను బాయ్స్ సినిమాకు హీరోగా రికమండ్ చేసిన ఆమెను తీసుకొచ్చి సిద్దూను ఏడిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Varun Tej: ప్రిన్స్ ఎంగేజ్ మెంట్.. మెగా కుటుంబం స్పందించరేంటి..?

సిద్దార్థ్ కెరీర్ గురించి అందరికి తెరిచిన పుస్తకమే. అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి హీరోగా మారినట్టు తెలిసిందే. అసలు అసిస్టెంట్ డైరెక్టర్ ను హీరోగా తీసుకోమని శంకర్ కు చెప్పిందెవరు అంటే.. డైరెక్టర్ మణిరత్నం దగ్గర సిద్దు అసోసియేట్ డైరెక్టర్ గా కెరీర్ మొదలుపెట్టాడు.. ఇక మణిరత్నం దగ్గర చేస్తున్న సమయంలోనే సిద్ధు మంచి యాక్టివ్ గా ఉండడం, చెప్పిన పని తొందరగా చేయడంతో మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఆ గుర్తింపు శంకర్ వరకు వ్యాపించింది. ఒకరోజు శంకర్ ఆఫీస్ నుంచి సిద్ధుకు కాల్ వస్తే.. ఆయన సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పిలుస్తున్నారని అనుకోని సిద్దు వెళ్ళాడట. కానీ, అక్కడకు వెళ్ళాకా.. అసిస్టెంట్ గా కాదు నా సినిమాకు హీరోగా చెయ్ అని చెప్పడంతో సిద్దు ఒక్కసారిగా షాక్ అయ్యాడట. అయితే సిద్దార్థ్ ను బాయ్స్ సినిమాకు హీరోగా రికమండ్ చేసింది సుజాత. మణిరత్నం వద్ద ఒక కుర్రాడు అసిస్టెంట్ గా చేస్తున్నాడు. బాయ్స్ సినిమాకు కుర్రాళ్లను వెతుకుతున్నారుగా.. అతడు బాగా చేస్తాడు.. తీసుకోండి అని శంకర్ కు సుజాత చెప్పడంతోనే శంకర్, సిద్దును ఓకే చేశారట. ఆ విషయం చాలా తక్కువ మందికి తెలుసు. ఇక ఇన్నేళ్ల తరువాత స్టేజీమీద సుజాతను చూసిన సిద్దు.. ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోయాడు. ఆమెకు పాదాభివందనం చేస్తూ చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. ఆమెను గట్టిగా హత్తుకొని థాంక్స్ చెప్పాడు. ఆ సమయంలో ఆమె కనుక శంకర్ కు సిద్దును రికమండ్ చేయకపోతే ఈరోజు ఈ హీరో ఎక్కడ.. ఎలా ఉండేవాడో అనేది దేవుడికే ఎరుక. మరి టక్కర్ తో మనోడు ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

Show comments