NTV Telugu Site icon

Siddharth: తారక్, మహేష్.. మధ్యలో సిద్దార్థ్ ఎవడు.. వీడేం చేస్తున్నాడు అంటారు

Sidh

Sidh

Siddharth: సిద్దార్థ్ .. తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. బొమ్మరిల్లు సినిమాతో కుర్రకారును మొత్తం తనకు ఫ్యాన్స్ గా మారిపోయారు. అక్కడ నుంచి సిద్దు ఏ సినిమాలో నటించినా అది మన సినిమాను అనుకున్నారు. ఇక గత కొంతకాలంగా సిద్దు తెలుగుకు దూరమయ్యాడు. ఇక చాలా గ్యాప్ తరువాత టక్కర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే సిద్దార్థ్ ప్రమోషన్ల జోరును పెంచేశాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మరోపక్క సిద్దు.. ఇన్నాళ్లకు తెలుగులో కనిపించేసరికి యాంకర్లు తమ మనసులో ఉన్న ప్రశ్నలు మొత్తం బయటపెట్టేశారు. అయినా, సిద్దు వాటన్నింటికి చక్కగా సమాధానం చెప్పుకొచ్చాడు.

Sharwanand: హే.. శర్వా.. నువ్వా.. పెళ్ళికి ముందే ఇలా మారిపోయావు ఏంటీ ..?

ఇక ఒక ఇంటర్వ్యూలో యాంకర్.. బొమ్మరిల్లు ఆడియో ఫంక్షన్ ఫోటో చూపించి దానిపై అభిప్రాయం అడిగాడు. బొమ్మరిల్లు ఆడియో ఫంక్షన్ కు అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్ గెస్టులుగా వచ్చారు. ఇప్పుడు ఇలాంటి ఫోటో దిగడం కుదురుందా అన్న ప్రశ్నకు సిద్దు మాట్లాడుతూ.. ” అవన్నీ ఇప్పుడు కుదరదు. అప్పుడు మా వయస్సు వేరు.. ఆ వైబ్ వేరు.. ఆ టైమ్ వేరు..ఇలాంటి ఫొటోస్ ఇప్పుడు చాలా తక్కువ వస్తున్నాయి. అది అందరి వైపు తప్పు ఉంది. నాకు బొమ్మరిల్లు హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే .. ప్రసాద్ ల్యాబ్స్ లో నేను, తారక్, మహేష్ కూర్చొని బొమ్మరిల్లు సినిమా చూసాం.. వాళ్లకు చాలాబాగా నచ్చింది. అందరం భోజనం చేసి.. ఎవరింటికి వాళ్లు వెళ్లి పడుకున్నాం. అదే ఇప్పుడు ఇలా జరగాలంటే మహేష్ ఇంటి దగ్గర నుంచి కారు బయటికి రాగానే ఒక 20 మంది జర్నలిస్టులు ఫాలో.. ఇక తారక్ ఇంటి దగ్గర నుంచి మరో 30 మంది.. దానికో పొలిటికల్ కలర్ ఉంటుంది.. తరువాత ఈ సిద్దార్థ్ గాడు మద్రాస్ నుంచి వచ్చి మధ్యలో ఏం చేస్తున్నాడు.. ? అనే ప్రశ్న వస్తుంది. ముగ్గురు హ్యాపీగా ఉండాలి అని కోరుకోవడం కాదు.. అసలువీరు హ్యాపీగా ఉండకూడదు అని అనుకొనేవారే ఎక్కువ. సంబంధం లేకుండా వాళ్ళ ఫ్యాన్స్ ఎందుకు కొట్టుకుంటున్నారు.. ఎందుకో నాకు తెలియదు. మేము హీరో ఫ్యాన్స్ గా పుట్టాం.. పెరిగాం.. కానీ ఇప్పుడు ఇదంతా చాల వరస్ట్ గా మారిపోయింది. అలాంటి రోజులు మళ్లీ రావాలి” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.

Show comments