NTV Telugu Site icon

Siddarth Madhavan: ఈ కాంబినేషన్ లో సినిమా అంటే మాములుగా ఉండదు

Siddharth Madhavan

Siddharth Madhavan

తమిళనాడులో తమకంటూ స్పెషల్ ఇమేజ్ అండ్ మార్కెట్ ని సొంతం చేసుకున్న హీరోలు ‘సిద్దార్థ్’, ‘మాధవన్’. లవ్, యాక్షన్, ఎక్స్పరిమెంట్స్, యూత్ ఫుల్ సినిమాలు చేసిన సిద్దార్థ్, మాధవన్ కి పాన్ ఇండియా రేంజులో కూడా మంచి గుర్తింపు ఉంది. హిందీలో కూడా స్ట్రెయిట్ సినిమాలు చేసిన ఈ ఇద్దరు హీరోలు కలిసి నటించిన ప్రతిసారీ ఒక మంచి సినిమా ఆడియన్స్ ముందుకి వచ్చింది. త్వరలో సిద్దార్థ్, మాధవన్ కలిసి నటిస్తున్నారనే అనౌన్స్మెంట్ బయటకి వచ్చింది కాబట్టి గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు ఏంటో చూద్దాం. మాధవన్ హీరోగా మణిరత్నం దర్శకత్వంలో ‘అమృత’ సినిమా వచ్చింది. ఈ మూవీలో సిద్దార్థ్ ఒక బస్ లో పాసింజర్ గా కనిపించాడు. తమిళ టైగర్స్ నేపధ్యంలో తెరకెక్కిన అమృత సినిమా ఒక మాస్టర్ పీస్ లా నిలిచిపోయింది.

ఆ తర్వాత మళ్లీ మాధవన్-సిద్దార్థ్ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ మణిరత్నంమే మళ్లీ ‘యువ’ సినిమా చేశాడు. ఈ మూవీ అల్ టైమ్ క్లాసిక్స్ లో ఒకటిగా నిలిచిపోయింది. యువ సినిమాలో మాధవన్-సిద్దార్థ్ లకి సూర్య కూడా కలిశాడు. అలా రెండు క్లాసిక్ సినిమాలతో సౌత్ లో మంచి పేరు తెచ్చుకున్న సిద్దార్థ్, మాధవన్ లు ఈసారి హిందీలో అడుగు పెట్టారు. రాకేష్ ఓం ప్రకాష్ దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ మూవీ ‘రంగ్ దే బసంతి’ సినిమాలో మాధవన్-సిద్దార్థ్ కలిసి నటించారు. మిస్టర్ పెర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ ‘చంద్ర శేఖర్ ఆజాద్’గా నటించిన ఈ మూవీలో సిద్దార్థ్ ‘భగత్ సింగ్’గా, మాధవన్ ‘అజయ్ సింగ్ రాథోడ్’ పాత్రలో నటించాడు. ఈ ముగ్గురు మధ్య సీన్స్ రంగ్ దే బసంతి సినిమాలో సూపర్బ్ గా ఉంటాయి. అలా సిద్దార్థ్-మాధవన్ తెరపై కలిసి కనిపించిన ప్రతిసారీ క్లాసిక్ అనిపించుకున్న సినిమా ఆడియన్స్ ముందుకి వచ్చింది. మరి ఈ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ శశికాంత్ డైరెక్ట్ చేస్తున్న ‘టెస్ట్’ సినిమా ప్రేక్షకులని ఎంతవరకూ మెప్పిస్తుంది అనేది చూడాలి.