Site icon NTV Telugu

Jr NTR fan last video: అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఎన్టీఆర్ ఫ్యాన్ శ్యామ్ చివరి వీడియో..

Jr Ntr Last Video

Jr Ntr Last Video

Shyam NTR Last Video Viral: జూ. ఎన్టీఆర్ వీరాభిమానిగా పేరున్న ఒక కుర్రాడు అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఈ ఘటనపై యావత్ ఎన్టీఆర్ అభిమానులు కన్నీటి సంద్రమవడమే కాదు శ్యామ్ మరణం విషయంలో న్యాయం చేయాలని సోషల్ మీడియాలో డిమాండ్ చేస్తున్నారు. ముందుగా ఇతర హీరోల అభిమానులు అన్నారు, ఆ తర్వాత ఇతర పార్టీల వల్లే అనే ప్రచారం కూడా ఇప్పుడు జరుగుతోంది. ఈ విషయం మీద జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందించారు, ఈ మేరకు ఒక లేఖను కూడా రిలీజ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శ్యామ్ హోటల్ మేనేజ్మెంట్ పూర్తి చేసి జాబ్ సెర్చింగ్ లో ఉన్నాడు. ఈ మధ్యన విశ్వక్ సేన్ నటించిన ధమ్కీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జూ. ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరవగా వేదికపైకి వెళ్తున్న ఎన్టీఆర్ ను మెరుపు వేగంతో వెనకనుంచి వచ్చి శ్యామ్ పట్టుకున్నాడు. ఆ సమయంలో సెక్యూరిటీ అతన్ని లాగేద్దాం అని ప్రయత్నించగా ఎన్టీఆర్ వారిని వారించి శ్యామ్ తో ఫొటో కూడా దిగాడు. అయితే తాజాగా శ్యామ్ గదిలో ముందుగా బ్లేడుతో కోసుకుని ఆ తరువాత ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయాడు.

Jr NTR: అభిమాని అనుమానాస్పద మృతి.. తక్షణమే దర్యాప్తు జరపాలని లేఖ విడుదల చేసిన ఎన్టీఆర్

ఏపీ పోలీసులు స్పందించి వేగవంతంగా దర్యాప్తు చేయాలని అందరూ కోరుతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో #WeWantJusticeForShyamNTR అనే హ్యాష్ టాగ్ వైరల్ అయింది. అయితే తాజాగా శ్యామ్ మాడ్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో శ్యామ్ మాట్లాడిన మాటలు యధాతధంగా మీకోసం’’ అయామ్ సారీ డాడీ, అయామ్ సారీ, నేను ఉన్నా లేకపోయినా హ్యాపీగా ఉండండి, నన్ను ఇన్ని రోజులు పెంచినందుకు థాంక్స్ మమ్మీ, డాడీ. నేను అందరి దృష్టిలో వేస్ట్, నేను ఉన్నా కానీ లాభం లేదు. సరేనా మమ్మీ డాడీ ఐ లవ్యూ ఫరెవర్, మళ్ళీ జన్మ అంటూ ఉంటె మీకే పుట్టాలి. అన్నట్టు చెప్పడం మరిచిపోయాను, నాకు జాబ్ మీద ఇంట్రెస్ట్ లేదు, జాబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ అస్సలు లేదు. నా వల్ల కాదు జాబ్ చేయడం కూడా, అందుకే నేను డిసైడ్ చేసుకున్నా, మిస్ యూ మమ్మీ, మిస్ యూ డాడీ. అన్న సాయి శ్రీను అన్న, మిస్ యూ అన్న, ఐ లవ్యూ అన్న, బిగ్గెస్ట్ బ్రదర్ నువ్వే అన్నా నా లైఫ్ లో మళ్ళీ జన్మ అంటూ ఉంటే మీ శిష్యుడిగానే పుట్టాలి అన్న’’

Exit mobile version