Site icon NTV Telugu

Shrikanth Iyyangar: ఏంటీ పెళ్లి పిచ్చి.. మొన్న ఆమె, ఇప్పుడీమె?

Srikanth Iyyengar

Srikanth Iyyengar

Shrikanth Iyyangar Back to Back posts on Marriage: శ్రీకాంత్ అయ్యంగార్ తెలుగువారికి సుపరిచితమే. ఆయన పేరు చెప్తే వెంటనే గుర్తుపట్టక పోయినా ఆయన్ని చూస్తే గుర్తుపట్టేస్తారు. ఎక్కువగా ఆర్జీవీ సినిమాల్లో కనిపించే ఆయన ఆర్జీవీ కాంప్ మనిషి అని పేరు తెచ్చుకున్నాడు. ఇక ఈయన ఎందుకో కానీ ఈ మధ్య రెండో పెళ్లి కోసం తెగ ఆరాట పడుతున్నాడు. ఈ మధ్య కాలంలో శ్రీకాంత్ అయ్యంగార్ రెండో పెళ్లికి రెడీగా ఉన్నట్లు ఒక పోస్ట్ చేశారు. ఆ అమ్మాయి ప్రేమలో పడ్డానని ఆయన పెట్టిన పోస్ట్ అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. శ్రీకాంత్ తన సోషల్ మీడియా ఖాతాలో ఒక అమ్మాయితో కలిసిన ఫోటో పెట్టి “మై లవ్.. ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను” అంటూ క్యాప్షన్ పెట్టి ఆ తర్వాత కాసేపటికి ఆ పోస్ట్ డిలీట్ చేశారు.

Weather Update: పలు రాష్ట్రాలకు IMD హెచ్చరిక.. భారీ వర్షాలు కురిసే అవకాశం..!

అప్పట్లో ఆ విషయం చర్చనీయాంశంగా మారగా ఇప్పుడు మళ్లీ శ్రీకాంత్ అయ్యంగార్ ఓ అమ్మాయి ఫోటో పెట్టి మళ్లీ పెళ్లి గురించి రాసుకొచ్చాడు. ఆమె తనను పెళ్లి చేసుకోవాలని కోరుకుంటున్నానని ఆయన చెప్పుకొచ్చాడు. ఇక నిజంగానే ఆయనకు రెండో పెళ్లిపై అంత కోరికగా ఉంటే ఆమెను ఒప్పించి చేసుకోవచ్చు. కానీ ఇలా సోషల్ మీడియాలో పెట్టాల్సిన అవసరం ఏముందో? తన గురువుగా చెప్పుకునే రామ్ గోపాల్ వర్మను ఫాలో అవుతూ ఆ అమ్మాయిలను ఆయన ఫ్లర్ట్ చేస్తున్నాడా? లేక వారికి ఫాలోవర్స్ పెరిగేలా ప్రమోట్ చేస్తున్నాడో ఆయనకే తెలియాలి. శ్రీకాంత్ అయ్యంగార్ బెదురులంక, సామజవరగమన వంటి సినిమాల్లో ఇటీవల నటించారు. బుజ్జి ఇలా రా,అజ్ఞాతవాసి,అంటే సుందరానికి, పండగ చేసుకో, ఎఫ్3, టక్ జగదీష్, నాంది,చావు కబురు చల్లగా, మర్డర్, వైరస్ వంటి మరికొన్ని సినిమాల్లో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి.

Exit mobile version