Site icon NTV Telugu

తనయుడిని పరిచయం చేసిన శ్రేయా ఘోషల్‌

ప్రముఖ సింగర్ శ్రేయా ఘోషల్‌ గత నెల మే 22న పండంటి మగబిడ్డకి జన్మనిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆమె కుమారుడిని చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు, ఫాలోవర్స్‌కు తాజాగా శ్రేయా సర్‌ప్రైజ్‌ అందించారు. తన భర్త శిలాదిత్యతో కలిసి తమ ముద్దుల తనయుడిని ఎత్తుకుని ఉన్న ఫొటోను షేర్‌ చేస్తూ కుమారుడిని పరిచయం చేశారు. ఈ సందర్భంగా తన తనయుడికి ‘దేవ్యాన్‌ ముఖోపాధ్యాయ’గా నామకరణం చేసినట్లు ఆమె వెల్లడించారు. తల్లిగా, తండ్రిగా తమ హృదయాలు మాటల్లో చెప్పలేనంత ప్రేమతో నిండిపోయాయని ఆమె చెప్పింది.

Exit mobile version