NTV Telugu Site icon

Sravana Bhargavi: ఎట్టకేలకు వివాదాస్పద వీడియో డిలీట్ చేసిన టాలీవుడ్ సింగర్

Sravana Bargavi

Sravana Bargavi

Sravana Bhargavi: టాలీవుడ్ సింగర్ శ్రావణ భార్గవి ఎట్టకేలకు వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టింది. గత నాలుగు రోజులుగా ఆమెపై అన్నమయ్య భక్తులు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. ఒకపరి కొకపరి అనే కీర్తనను ఆలపించిన శ్రావణ భార్గవి ఆ వీడియోలో కాళ్లు చేతులు ఊపుతూ కనిపించింది. దీంతో హిందూ ధర్మశాస్త్రాన్ని శ్రావణ భార్గవి అవమానించిందని, వెంటనే ఆ వీడియోను డిలీట్ చేయాలని టీటీడీ సభ్యులు వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఆ వీడియోలో అశ్లీలత ఎక్కడా లేదని, ఆ వీడియో తీయడానికి తాను చాలా కష్టపడినట్లు చెప్పుకొచ్చిన ఆమె వీడియో డిలీట్ చేయడం కుదరదని తేల్చి చెప్పింది. దీంతో ఈ వివాదం మరింత ముదిరింది. అన్నమయ్య భక్తులతో పాటు శ్రీవారి భక్తులు కూడా ఆ వీడియోను ఢిల్లీ చేయాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కారు.

శ్రావణ బార్గవిపై తిరుపతి లో ఫిర్యాదు చేయడమే కాకుండా ఆమె ఫోటోలు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఇక ఈ వివాదాన్ని ఎక్కువ దూరం లాగితే కెరీర్ కే ప్రాబ్లెమ్ అనుకున్నదో ఏమో శ్రావణ భార్గవి వెనక్కి తగ్గింది. తన యూట్యూబ్ ఛానెల్ నుంచి వివాదాస్పద వీడియోను డిలీట్ చేసింది. అయితే ఆ వీడియోలో తప్పు ఏముంది..? నేను డిలీట్ చేయను అని చెప్పిన ఆమె సడెన్ గా వీడియో డిలీట్ చేయడానికి కారణం ఏంటి..? ఇన్నిరోజులు పబ్లిసిటీ కోసం మాత్రమే చేసిందా..? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ విషయమై శ్రావణ భార్గవి ఎలా స్పందిస్తుందో చూడాలి.

Show comments