‘జెర్సీ’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది నటి శ్రద్ధా శ్రీనాథ్. తొలి సినిమాతోనే విజయాన్ని అందుకుని, నటన పరంగా మంచి మార్కులు కొట్టేసింది ఈ బ్యూటీ. ఆ తర్వాత వరుసగా ఆఫర్లు అందుకుంటూ.. తెలుగు, తమిళ్, కన్నడ భాషలతో పాటు హిందీ లోనూ నటించింది. ఇక రీసెంట్‌గా బాలయ్య బాబు సరసన ‘డాకు మహారాజ్’ మూవీలో నటించి మంచి హిట్ అందుకున్న శ్రద్ధా శ్రీనాథ్ మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది.
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన ‘జైలర్’ మూవీ ఎంతటి అద్భుతమైన విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాను మంచి స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాడు. అనిరుధ్ మ్యూజిక్ ఈ మూవీని నెక్స్ట్ లెవెల్‌కు తీసుకెళ్లింది. ఇక ఈ మూవీకు కొనసాగింపుగా ‘జైలర్ 2’ రాబోతున్న సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమాలో ‘కేజీయఫ్’ చిత్ర హీరోయిన్ శ్రీనిధి శెట్టి కీలక పాత్రలో నటించేందుకు సెలెక్ట్ అయినట్లుగా కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపించగా, ఇప్పుడు తాజగా ‘జైలర్ 2’లో శ్రద్దా శ్రీనాథ్ ఓ కీలక పాత్రలో నటిస్తోందని టాక్ వినపడుతుంది. ఆమె పాత్ర సినిమాలో చాలా కీలకం అని తెలుస్తోంది. దీని గురించి అధికారికంగా ప్రకటన రావాల్సి ఉంది. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ ‘జైలర్2’ ను కూడా గ్రాండ్ గా నిర్మించబోతున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ ‘కూలీ’ సినిమాతో బిజీగా ఉన్నారు. టైగర్ కా హుకూమ్ అంటూ ‘ జైలర్ 2’ లో ఎలా కనిపిస్తాడో చూడాలి.