Kaliyugam: శ్రద్ధ శ్రీనాథ్… కన్నడ కిషోర్ కాంబినేషన్ తో “కలియుగం”…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో త్వరలో కలియుగం అనే సినిమా రిలీజ్ కాబోతోంది. జెర్సీ ఫేమ్ శ్రద్ధ శ్రీనాథ్ కాంతార ఫేమ్ కిషోర్ ఈ సినిమాలో పోటాపోటీగా నటించారు. ఈ సినిమా ఇప్పటివరకూ భారతీయ సినీ ఇండస్ట్రీ లో తెరకెక్కని అద్భుతమైన కథతో హర్రర్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కనుంది. 2064 సంవత్సరంలో ఈ మానవాళికి ఏమవుతుంది ఎలాంటి మార్పులు సంభవిస్తాయి? అనే విషయాలను ఆధారంగా చేసుకుని ఇండియాలోనే మొట్టమొదటిసారిగా పోస్ట్ అపోకలిప్స్ కాన్సెప్ట్ తో ఈ సినిమాను నిర్మింప చేశారు. భారీస్థాయిలో నిర్మాణమవుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో బిజీగా ఉంది. అద్భుతమైన గ్రాఫిక్స్ హాలీవుడ్ స్థాయి మేకింగ్ ఈ సినిమాని మరో లెవల్ కు తీసుకు వెళుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆర్ కె ఇంటెర్నేషనల్” బ్యానర్ లో కె ఎస్ రామకృష్ణ నిర్మించారు.
అడ్వర్టైజ్మెంట్ రంగంలో ఎన్నో యాడ్స్ కి డైరెక్టర్ గా పనిచేసిన ప్రమోద్ సుందర్ తొలిసారిగా మెగా ఫోన్ పట్టి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. ఇండియన్ ఫేమస్ సినిమాటోగ్రాఫర్ పి సి శ్రీరామ్ దగ్గర చాలా సంవత్సరాలు అసిస్టెంట్ గా పనిచేసిన రామ్ చరణ్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు. నాలుగుసార్లు కేరళ ప్రభుత్వం నుంచి అవార్డులు అందుకున్న డాన్ విన్సెంట్ ఈ సినిమాకి సంగీత దర్శకత్వం చేస్తున్నారు. హై టెక్నికల్ వాల్యూస్తో తెరకెక్కుతున్న ఈ కలియుగం సినిమా సినీ ప్రేక్షకులను రంజింప చేస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే దాదాపుగా అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమాని త్వరలో విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దక్షిణ భారత భాషలతో పాటు హిందీలో కూడా ఈ సినిమాని పెద్ద ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
Also Read
- Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
- Sidharth - Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
- Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
- Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని 'రణబాలి'తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
తాజావార్తలు
-
Sivakarthikeyan: ఫ్యాన్స్‌కు శివకార్తికేయన్ ఇచ్చిన ఆ ఒక్క సలహా.. నెట్టింట వీడియో వైరల్!
-
Sidharth – Kiara: రెండోసారి తల్లిదండ్రులు కాబోతున్న స్టార్ కపుల్!
-
Hanuman Ansh Telugu: ‘హనుమాన్ అంశ్’ తెలుగు రిలీజ్.. త్రివిక్రమ్ వెనకంజ వేయడనికి కారణం ఏంటి?
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!