Site icon NTV Telugu

AL Vijay: అమలా పాల్ మాజీ భర్తపై యువకుడు దాడి.. కారును ఆపి

Amala

Amala

AL Vijay: కోలీవుడ్ లో అసలు ఏం జరుగుతుందో అర్ధం కాకుండా ఉంది. గతరాత్రి దళపతి విజయ్ పై చెప్పుల దాడి జరిగిన విషయం తెల్సిందే. విజయకాంత్ కు నివాళులు అర్పించడానికి వెళ్లిన విజయ్ పై గుర్తుతెలియని వ్యక్తి చెప్పు విసిరాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇంకా నెట్టింట వైరల్ గా మారింది. అది ఇంకా మరువకముందే కోలీవుడ్ డైరెక్టర్ పై ఒక యువకుడు దాడి చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఏఎల్ విజయ్.. డైరెక్టర్, నటి అమలా పాల్ మాజీ భర్త. ఎన్నో మంచి సినిమాలను తెరకెక్కించి స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అరుణ్ విజయ్ తో మిషన్ చాప్టర్ 1 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఇక విజయ్ కారుకు అడ్డుపడి ఒక యువకుడు దాడి చేశాడు. దీంతో అతనిపై విజయ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేయడం జరిగింది.

ఫిర్యాదు అనంతరం మీడియాతో విజయ్ మాట్లాడుతూ.. ” నా కారులో మ్యానేజర్ మణివర్మ,అసిస్టెంట్ డైరెక్టర్స్ తో కలసి టీనగర్ హబీబుల్లా రాడ్ లో ప్రయాణిస్తుండగా ఓ యువకుడు సడెన్ గా కారుపైకి దూసుకువచ్చాడు. నా కారుకి అడ్డం రావడమే కాక మాతో వాగ్వాదానికి దిగాడు. తన హెల్మెట్ తో కారుని పలుమార్లు కొట్టాడు.అంతటితో ఆగకుండా నాపై కూడా దాడికి ప్రయత్నించాడు. ఆ దాడిలో మా మేనేజర్ మణివర్మ స్వల్పంగా గాయపడ్డాడు” అని చెప్పుకొచ్చాడు. ఇక విజయ్ ఫిర్యాదును అందుకున్న పోలీసులు ఆ యువకుడును పట్టుకున్నారు. అతడి పేరు ఐజాక్ అని గుర్తించారు. మద్యం మత్తులో అతను, విజయ్ పై దాడికి ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసుల అదుపులోనే నిందితుడు ఉన్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Exit mobile version