Site icon NTV Telugu

Sobhita: ‘చైతూ’కి షాకిచ్చిన శోభిత!

Sobhita

Sobhita

Sobhita: అదేంటి త్వరలో వివాహానికి సిద్ధమవుతున్న సమయంలో ఇప్పుడు నాగచైతన్యకి శోభిత షాక్ ఇవ్వడం ఏమిటి అని ఆశ్చర్యపోకండి. అసలు విషయం ఏమిటంటే శోభిత సహా నాగచైతన్య కుటుంబ సభ్యులు అందరూ ప్రస్తుతానికి గోవాలో ఉన్నారు. ఎందుకంటే అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలను గోవా ఫిలిం ఫెస్టివల్ లో గ్రాండ్గా నిర్వహిస్తున్నారు. పలు కార్యక్రమాలకు కుటుంబాన్ని కూడా ఆహ్వానించిన నేపథ్యంలో అక్కినేని కుటుంబ సభ్యులతో పాటు కాబోయే అక్కినేని కుటుంబ సభ్యురాలు శోభిత కూడా హాజరైంది. అయితే ఈరోజు నాగచైతన్య పుట్టినరోజు సందర్భంగా ఆమె చైతన్యకు ఒక సర్ప్రైజ్ బర్త్డే పార్టీ ప్లాన్ చేసిందట.

Also Read: Akkineni : సూసైడ్ చేసుకోవాలనుకున్న అక్కినేని.. ఎందుకో తెలుసా

ఈ విషయం ముందుగా చైతన్యకు ఏమాత్రం తెలియకుండా ఆమె జాగ్రత్త పడిందని కరెక్ట్ గా బర్తడే సమయానికి ఆ పార్టీ వేదిక వద్దకు తీసుకెళ్లి నాగచైతన్యకు షాక్ ఇచ్చిందని తెలుస్తోంది. ఇక త్వరలోనే వీరి వివాహం అక్కినేని నాగేశ్వరరావుకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరగబోతోంది. డిసెంబర్ 4వ తేదీన సాయంకాలం ముహూర్తం నిర్ణయించారు. ఈ మేరకు ఇప్పటికే ఒక వివాహ పత్రిక కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఇక అక్కినేని నాగచైతన్య శోభిత వివాహం గురించి కూడా నిన్న గోవా ఫిలిం ఫెస్టివల్ లో నాగార్జున మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Exit mobile version