Site icon NTV Telugu

Bigg Boss Telugu 7: బిగ్ బాస్ హౌస్‌కి కొత్త కెప్టెన్‌గా శోభా.. భలే కాపాడేశావు బాసు!

Shobha Shetty

Shobha Shetty

Shobha Shetty becomes the new captain of Bigg boss Telugu 7 house: బిగ్ బాస్ హౌస్‌కి కొత్త కెప్టెన్‌గా శోభాశెట్టి ఎంపికైనట్టు తెలుస్తోంది. నిజానికి నేటి ఎపిసోడ్ ఇంకా ప్రసారం కాలేదు, కానీ ప్రోమోతో కొంత క్లారిటీ వచ్చేసింది. అయితే ఇప్పుడు శోభాశెట్టి బిగ్ బాస్ హౌస్‌కి కొత్త కెప్టెన్‌గా మారడం, అనధికారిక పోల్స్‌లో శోభా శెట్టి చివరి స్థానంలో ఉండటంతో ఈ వారం ఎలిమినేషన్ ఆసక్తికరంగా మారింది. నిజానికి ఈ వారం ఆమె ఎలిమినేట్ అవుతుందని అంతా అనుకున్నారు. ఈ సమయంలో, ఆమె కెప్టెన్సీని అందుకుని బిగ్ బాస్ హౌస్‌కి కొత్త కెప్టెన్‌గా మారింది. మరి ఈ వారం ఏం జరుగుతుందో అనేది ఆసక్తికరంగా మారింది. బిగ్ బాస్ మొదటి సీజన్‌లో, ముమైత్ ఖాన్ కెప్టెన్ అయిన అదే వారంలో ఎలిమినేట్ అయింది. ఇప్పుడు శోభకు ముమైత్‌కు పట్టిన గతే పడుతుందా? లేక ఈమెకు ఏమైనా స్పెషల్ అవకాశం ఇస్తారేమో చూడాలి మరి. సెప్టెంబర్ 3న ప్రారంభమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో చాలా మంది మహిళా కంటెస్టెంట్లు మొదటి నుంచి ఎలిమినేట్ అయ్యారు. అయితే గతవారం టైటిల్ ఫేవరెట్ గా నిలిచిన సందీప్ అనూహ్యంగా ఎలిమినేట్ అయ్యి హౌస్ నుంచి వెళ్లిపోయారు.

Maa Oori Polimera 2 Review: ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్న ‘మా ఊరి పొలిమేర 2’ రివ్యూ

ఇప్పుడు బిగ్ బాస్ తొమ్మిదో వారంలో కూడా టాప్ కంటెస్టెంట్ ఎలిమినేట్ కానున్నట్లు సమాచారం. బిగ్ బాస్ తెలుగు 9వ వారానికి 8 నామినేషన్లు ఉన్నాయి. అమర్‌దీప్, శోభా శెట్టి, రాతిక రోజ్, భోలే షావలి, ప్రియాంక జైన్, టేస్టీ తేజ, ప్రిన్స్ యావర్ అలాగే అర్జున్ అంబటి బిగ్ బాస్ తొమ్మిదో వారంలో నామినేట్ అయ్యారు. ప్రిన్స్ యావర్, భోలే – అమర్‌దీప్ చౌదరి మొదటి రోజు నుండి అత్యధిక ఓట్లను పొందుతున్నారు. ప్రిన్స్ యావర్ మొదటి స్థానంలో, భోలే రెండో స్థానంలో నిలవగా అమర్‌దీప్‌కి ప్రేక్షకులు మూడో స్థానం ఇచ్చారు. ఇక అర్జున్ నాలుగో స్థానంలో, ప్రియాంక ఐదో స్థానంలో, రతిక ఆరో స్థానంలో ఉన్నారు. డేంజర్ జోన్‌లో టేస్టీ తేజ సెవెంత్ ప్లేస్‌లో ఉండగా, శోభ ఎనిమిదో స్థానంలో నిలిచారు. శోభాశెట్టి కొత్త కెప్టెన్‌గా మారడంతో, ఆమెను వదిలేస్తారా లేక షో నుండి ఎలిమినేట్ అవుతుందా అనేది వేచి చూడాలి. ఈ వారం శోభాశెట్టి ఎలిమినేట్ అయితే వచ్చే వారానికి బిగ్ బాస్ కొత్త కెప్టెన్ ఎవరనేది ఎలా ఎన్నుకుంటారో చూడాలి.

Exit mobile version