1980లలో హీరోయిన్‌గా వెండితెరపైకి వచ్చిన శోభన, అక్కినేని నాగార్జున తొలి చిత్రం ‘విక్రమ్’లో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ఇప్పటివరకు 230 కి పైగా సినిమాల్లో నటించారు. తెలుగులో మువ్వగోపాలుడు, రుద్రనేత్ర, అప్పుల అప్పారావు, నారీ నారీ నడుమ మురారి, అల్లుడుగారు, ఏప్రిల్ 1 విడుదల, రౌడీగారి పెళ్లాం వంటి చిత్రాలతో ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచారు. అయితే..
Also Read : The Luck : “ది లక్” – సామాన్యుల కోసం తొలి రియాలిటీ గేమ్ షో!
సినీ ఇండస్ట్రీలో ప్రతి హీరో, హీరోయిన్ విభిన్న పాత్రలు చేసి తమ ప్రతిభను నిరూపించుకోవాలని కసితో ఉంటారు. హీరోయిన్లు ఎక్కువగా గ్లామర్, ఫ్యామిలీ డ్రామా, యాక్షన్ వంటి రకాల పాత్రలో కనిపిస్తారు. కానీ, హిజ్రా పాత్ర చేయాలనే ఆలోచన మాత్రం చాలా అరుదు. ఎందుకంటే ఆ క్యారెక్టర్‌ను ఎక్కువ మంది చిన్న చూపుతో చూడడం వల్ల హీరోయిన్లు దానికి దూరంగా ఉంటారు. అయితే టాలీవుడ్ సీనియర్ నటి శోభన మాత్రం తన కల ఏంటంటే.. తెరపై హిజ్రాగా నటించడం అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
శోభన చెబుతున్నది ఏమిటంటే.. ‘తెరపై హిజ్రా పాత్ర చాలా ఛాలెంజింగ్‌ది, చూడటానికి సులభంగా అనిపించినా, నిజానికి అది నటించడానికి గొప్ప ధైర్యం, నైపుణ్యం కావాలి. ఇప్పటికే కొంతమంది దర్శకులతో ఈ విషయం గురించి మాట్లాడాను, కానీ వాళ్లు తనను అలాంటి పాత్రలో చూపించడానికి సిద్ధంగా లేరని వెల్లడించారు. ఎందుకంటే ప్రేక్షకులు కూడా నన్ను అలా చూడటానికి ఇష్టపడరేమో అనే సందేహం నాకు ఉంది. అయినప్పటికీ, ఎవరైనా దర్శకుడు నన్ను ఆ పాత్ర కోసం సంప్రదిస్తే.. ఎలాంటి సందేహం లేకుండా వెంటనే ఓకే చెబుతాను” అని శోభన స్పష్టం చేశారు. ఇంతటి గౌరవం, గుర్తింపు పొందిన శోభన, తన కల మాత్రం ఒక హిజ్రా పాత్ర అని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. నిజంగా ఎవరైనా దర్శకుడు ఆమె కలను నిజం చేస్తారా? లేక ఈ డ్రీమ్ క్యారెక్టర్ శోభన మనసులోనే మిగిలిపోతుందా? అన్నది ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
