Site icon NTV Telugu

Shivanna: కన్నడ సూపర్ స్టార్ మత్తులో కోలీవుడ్ ఆడియన్స్…

Shivanna

Shivanna

సూపర్ స్టార్ రజినీకాంత్ కంబ్యాక్ హిట్ గా నిలుస్తూ జైలర్ సినిమా బాక్సాఫీస్ దగ్గర సెన్సేషనల్ రికార్డ్స్ ని క్రియేట్ చేసింది. జైలర్ సినిమా క్లైమాక్స్ లో శివన్న, మోహన్ లాల్, రజినీకాంత్ ల పైన డిజైన్ చేసిన సీన్ కి థియేటర్స్ లో విజిల్స్ పడ్డాయి. ముఖ్యంగా శివన్న స్క్రీన్ ప్రెజెన్స్ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. పంచె కట్టులో ఊర మాస్ గా కనిపించిన శివన్న ఒక్క డైలాగ్ కూడా చెప్పకుండా కేవలం తన లుక్స్ తో ర్యాంపేజ్ ని సృష్టించాడు. శివన్న స్క్రీన్ ప్రెజెన్స్ ని మరింత ఎలివేట్ చేస్తూ అనిరుద్ ఇచ్చిన ‘హుకుమ్’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పూనకాలు తెచ్చేలా ఉంది. దీంతో జైలర్ రిలీజ్ సమయంలో తమిళనాడు మొత్తం శివన్న పేరు మారుమోగుపోయింది.

Read Also: Guntur Karam : గుంటూరు కారంకు మహేష్ బాబు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

కన్నడ సూపర్ స్టార్ శివన్నని తమిళ ఆడియన్స్ కంప్లీట్ గా ఓన్ చేసుకోని ఆయన సినిమాలకి వెత్తుకొని మరీ యూట్యూబ్ లో చూసారు. జైలర్ తో ఇలాంటి ఇంపాక్ట్ చూపించిన శివన్న… ఇప్పుడు కెప్టెన్ మిల్లర్ సినిమాతో మరోసారి తన మాస్ ని చూపిస్తున్నాడు. ధనుష్ హీరోగా నటించిన కెప్టెన్ మిల్లర్ సినిమాలో శివన్న ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసాడు. ఈ క్యారెక్టర్ కి అరుణ్ మాతేశ్వరన్ ఇచ్చిన ఎలివేషన్స్ అండ్ ధనుష్-శివన్న మధ్య సీన్స్ కి కోలీవుడ్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. తన స్క్రీన్ ప్రెజెన్స్ తో శివన్న తమిళనాడులో కేవలం క్యామియో రోల్స్ తోనే స్టార్ హీరో అయిపోయాడు.

Read Also: Captain Miller: మిల్లర్ తెలుగులో వస్తున్నాడు… డేట్ లాక్డ్

Exit mobile version