NTV Telugu Site icon

Pallavi Prashanth: చంచల్గూడ జైలుకు పల్లవి ప్రశాంత్.. నోరు మెదపని శివాజీ.. ప్రెస్ మీట్ అనౌన్స్ చేసిమరీ?

Pallavi Prashanth Shijavji

Pallavi Prashanth Shijavji

Shivaji Silence on Pallavi Prashanth Arrest Became Hot topic: రైతు బిడ్డగా బిగ్ బాస్ 7 హౌస్ లోకి అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్ అందరినీ ఆకట్టుకునేలా గేమ్ ఆడి చివరికి బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ గా నిలిచాడు. ఎప్పుడైతే బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ గా టైటిల్ గెలిచి బయటకు వచ్చాడో అప్పటి నుంచి పూర్తిగా అతని బిహేవియర్ మారిపోయింది. ఈ విషయం బిగ్ బాస్ ఫాలో అయిన అందరికీ దాదాపు అర్థమయ్యే ఉంటుంది. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నంతవరకు ప్రశాంత్ నటుడు శివాజీ చెప్పినట్లు వింటూ ఉండేవాడు, అన్ని విషయాల్లోనూ శివాజీ సలహాలు తీసుకుంటూ మంచివాడిగా సింపతి సంపాదించే ప్రయత్నం చేసినట్టు ఇప్పుడు అనిపిస్తుంది. అయితే పల్లవి ప్రశాంత్ తాను కప్పు గెలవడానికి శివాజీ ప్రాబాల్యం ఎంతో ఉందని చెప్పుకుంటూ వచ్చాడు. శివాజీ కూడా తాను లేకపోతే పల్లవి ప్రశాంత్ అనే వ్యక్తిని వీళ్ళందరూ ఏం చేసేవారో అన్నట్టుగా మాట్లాడుతూ వచ్చాడు. అయితే ఇదంతా ఒకప్పుటి విషయం. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ బిగ్బాస్ సెట్ బయట జరిగిన గొడవల నేపథ్యంలో అరెస్టయి చంచల్గూడ జైలుకు వెళ్లాడు.

Salaar Advance Booking: మొదటి రోజే 30 లక్షల టికెట్లు.. అవి కూడా ఓపెన్ చేస్తే రచ్చే!

ఈ విషయం మీద ఇప్పుడిప్పుడే ఒక్కొక్క సెలబ్రిటీ బయటకు వస్తున్నారు. సోహైల్, అశ్విని శ్రీ, భోలే షావలి వంటి వారు వీడియోలు చేసి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఇలా జైలుకు వెళ్లిన దాఖలాలు లేవని అతను చేయని తప్పుకు అతని దయచేసి బలి చేయవద్దు ఈ విషయంలో పునరాలోచన అంటూ పోలీస్ డిపార్ట్మెంట్ కి విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే ఇంత జరుగుతున్నా హౌస్ లో పల్లవి ప్రశాంత్ కి అండగా నిలిచిన శివాజీ మాత్రం నోరు మెదపక పోవడం గమనార్హం. వాస్తవానికి నిన్న సాయంత్రం 6 గంటలకు మీడియాతో ముచ్చటించేందుకు శివాజీ సిద్ధమయ్యాడు. అయితే అనూహ్యంగా ఆ ప్రెస్ మీట్ అనౌన్స్ చేసి తర్వాత క్యాన్సల్ కూడా చేసేసాడు. మీడియా ఖచ్చితంగా పల్లవి ప్రశాంత్ గురించి ప్రశ్నిస్తుంది అని అర్ధం అయ్యే ప్రెస్ మీట్ క్యాన్సిల్ చేసినట్టు తెలుస్తోంది. ఇప్పుడు పల్లవి ప్రశాంత్ విషయంలో బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఒక్కరక్కరు వీడియోలు చేస్తూ రిలీజ్ చేస్తుంటే శివాజీ మౌనం మాత్రం హాట్ టాపిక్ అవుతోంది.

Show comments