Shiva Raj Kumar Intresting Comments on his role in RC16: రామ్ చరణ్ తేజ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా చేస్తున్నాడు. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఈ ఏడాదిలో ఎట్టి పరిస్థితుల్లో రిలీజ్ చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ కూడా దాదాపు పూర్తి కావస్తున్న నేపద్యంలో రామ్ చరణ్ తేజ తన 16వ సినిమా మొదలు పెట్టాడు. ఈరోజు ఈ సినిమాకి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మెగాస్టార్ చిరంజీవి, సుకుమార్, శంకర్ వంటి వాళ్లు ముఖ్య అతిథులుగా హాజరైన ఈవెంట్ కి రెహమాన్, రామ్ చరణ్, జాన్వీ కపూర్ వంటి వారు హాజరయ్యారు. అయితే ఈ సినిమా గురించి నటుడు శివరాజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి. కన్నడ సూపర్ స్టార్ గా వెలుగొందుతున్న శివ రాజ్ కుమార్ ఈ మధ్యకాలంలో తమిళ, తెలుగు సినిమాల్లో గెస్ట్ ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఆయన చేసిన జైలర్ సూపర్ హిట్ కాగా మరికొన్ని సినిమాల్లో కూడా ఆయన కనిపించబోతున్నాడు.
Thandel- Matka: చై- తండేల్, వరుణ్- మట్కాకి అమెజాన్ ప్రైమ్ గండం?
అదే విధంగా రామ్ చరణ్ 16వ సినిమాలో కూడా ఆయన కనిపించబోతున్నాడు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమా కథ చెప్పడానికి బుచ్చిబాబు తన దగ్గరికి వచ్చినప్పుడు తాను మామూలుగానే కథ వినడానికి కూర్చున్నాను కానీ తన పాత్ర చెప్పిన తర్వాత మైండ్ బ్లాక్ అయిందని ఆయన చెప్పుకొచ్చారు. అతను చెప్పిన క్యారెక్టర్ కంప్లీట్ గా వేరే లెవెల్ లో ఉంటుందని అసలు అతను అలాంటి ఒక క్యారెక్టర్ ని ఎలా ఊహించి రాసుకున్నాడో అని ఆశ్చర్యపోయానని అన్నారు. ఇక తనకి రామ్ చరణ్ అంటే చాలా ఇష్టమని, అతను చాలా మంచి మనిషి అని, ఒక మంచి యాక్టర్ కూడా అని చెప్పుకొచ్చారు. బుచ్చిబాబు అరగంటలో కథ చెబుతానని కూర్చుని దాదాపు గంటన్నరసేపు కథ చెబుతూనే ఉన్నా నేను మారు మాట్లాడలేకపోయానని అంత అద్భుతంగా కథ నేరేట్ చేశాడని శివ రాజ్ కుమార్ చెప్పుకొచ్చారు.
