NTV Telugu Site icon

Ghost Telugu Trailer: ఆ ఏజ్ ఏంటి? ఆ స్టంట్స్ ఏంటి శివన్న… పునీత్ రాజ్ కుమార్ లా కనిపించావ్

Ghost Telugu Trailer

Ghost Telugu Trailer

కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్… మొదటిసారి కర్ణాటక బౌండరీలు దాటి పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. గ్యాంగ్ స్టర్ డ్రామా కథతో రూపొందుతున్న ‘ఘోస్ట్’ సినిమాతో శివన్న ఈ అక్టోబర్ 19న ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. పోస్టర్స్, టీజర్, సాంగ్స్ తో వింటేజ్ వైబ్స్ ఇస్తున్న ఘోస్ట్ సినిమాపై కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఉన్నాయి. ‘వన్స్ ఏ గ్యాంగ్ స్టర్, ఆల్వేస్ ఏ గ్యాంగ్ స్టర్’ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ‘ఘోస్ట్’ సినిమాని ‘బీర్బల్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ‘శ్రినీ’ డైరెక్ట్ చేస్తున్నాడు. శివన్నతో పాటు ఉపేంద్ర, రాజ్ బీ శెట్టి కూడా ఘోస్ట్ సినిమాలో నటిస్తుండడంతో కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. బిగ్ డాడీ పాత్రలో శివన్నని చూపిస్తున్న ఘోస్ట్ మూవీ నుంచి, లేటెస్ట్ గా ట్రైలర్ బయటకి వచ్చింది. ఘోస్ట్ తెలుగు ట్రైలర్ ని దర్శక ధీరుడు రాజమౌళి లాంచ్ చేసాడు.

KGF స్టైల్ లో ఓపెన్ అయ్యి… ఆ తర్వాత కంప్లీట్ గ్యాంగ్ స్టర్ డ్రామా గా ఘోస్ట్ ట్రైలర్ సాగింది. నిమిషాల నిడివితో కట్ చేసిన ట్రైలర్ ప్రతి ఫ్రేమ్ గ్రాండ్ గా కనిపించింది. యాక్షన్ డోస్ పాన్ ఇండియాకి పర్ఫెక్ట్ గా సరిపోయే రేంజులో ఉంది. ఘోస్ట్ ట్రైలర్ కి మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్య ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రెమండస్ గా ఉంది. ఇక శివన్న లుక్స్, చేసిన స్టంట్స్ చూస్తే ఆ ఏజ్ లో ఆ స్టంట్స్ ఏంటని షాక్ అవ్వాల్సిందే. శ్రీనీ శివన్నని ప్రెజెంట్ లుక్ లోనే కాదు యంగ్ లుక్ లో కూడా సూపర్బ్ గా ప్రెజెంట్ చేసాడు. డీఏజింగ్ టెక్నాలజీని సూపర్బ్ గా వాడిన ఘోస్ట్ టీం… శివన్న యంగర్ లుక్ లో చూస్తుంటే పునీత్ రాజ్ కుమార్ ని చూసినట్లు అనిపిస్తుంది. ఒకవేళ నిజంగానే పునీత్ గెస్ట్ రోల్ ప్లే చేసి ఉంటే ఘోస్ట్ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసేది. శివన్న లుక్స్ అండ్ మేకింగ్ విజువల్స్ ని చూస్తుంటే… భారీ గ్యాంగ్ స్టర్ డ్రామా చూడబోతున్నాం అనే ఫీలింగ్ కలుగుతుంది మరో అక్టోబర్ 19న ఘోస్ట్ పాన్ ఇండియా మార్కెట్ లో ఎలాంటి రిజల్ట్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి.

Show comments