Site icon NTV Telugu

Vijay Devarakonda : నెక్స్ట్ మూవీ కోసం స్టార్ డైరెక్టర్ ?

anirudh

సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తన తదుపరి చిత్రాన్ని “టక్ జగదీష్” ఫేమ్ దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో చేయబోతున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. “లైగర్‌” షూటింగ్ పూర్తి చేసిన విజయ్ ఇప్పుడు మళ్లీ పూరి జగన్నాధ్‌తో “జనగణమన” అనే మరో భారీ పాన్ ఇండియా సినిమాకు సిద్ధమయ్యాడు. అయితే ఏకకాలంలో పూరీతో పాటు శివ నిర్వాణ చిత్రాన్ని కూడా పూర్తి చేయబోతున్నాడట విజయ్. అయితే విజయ్, శివ నిర్వాణం ప్రాజెక్ట్ పై ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ రూమర్లు మాత్రం చక్కర్లు కొడుతున్నాయి.

Read Also : RRR : మరో కాంట్రవర్సీలో జక్కన్న మూవీ

తాజా వార్త ఏమిటంటే… ఈ చిత్రానికి సంగీతం అందించడానికి స్టార్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్‌ను తీసుకోవాలని శివ నిర్వాణ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో ఈ దర్శకుడు సంగీత దర్శకులు గోపీ సుందర్, తమన్‌లతో కలిసి పని చేశారు. ఇక ఇప్పుడు వస్తున్న వార్తలు నిజమైతే శివ నిర్వాణం, అనిరుద్ కలిసి చేయబోతున్న మొదటి సినిమా ఇదే అవుతుంది. అయితే ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్ట్ లో సౌత్ సైరన్ సమంత విజయ్‌తో రొమాన్స్ చేయనుందని ఊహాగానాలు జోరందుకున్నాయి.

Exit mobile version