NTV Telugu Site icon

Shekar Kamala: ధ‌నుష్ అలా మాట్లడుతాడని అసలు ఊహించలేదు : శేఖ‌ర్ క‌మ్ముల

Shekar Kamula, Danush

Shekar Kamula, Danush

శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శక‌త్వంలో ధ‌నుష్‌ హీరోగా ‘కుబేర’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ముందుగా వీరిద్దరి కాంబోలో మూవీ అంటే.. ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పాలి. ఎందుకంటే సున్నిత‌మైన ల‌వ్ స్టోరీలు, ఫీల్ గుడ్ సినిమాలు తీసే క‌మ్ముల‌.. త‌మిళంలో అని జాన‌ర్లలో సినిమాలు చేసే ధ‌నుష్‌తో జ‌త క‌డ‌తాడ‌ని ఎవ్వరూ ఊహించలేరు.అలాటి వీరిద్దరి క‌ల‌యిక‌లో తెర‌కెక్కుతున్న ఈ ‘కుబేర’ సినిమా పై బారీ అంచ‌నాలు ఉన్నాయి. రీసెంట్‌గా విడుద‌లైన టీజ‌ర్ చూస్తే.. క‌మ్ముల ధనుష్‌కి న‌ప్పే సినిమానే చేస్తున్నట్లు క్లియర్‌గా తెలుస్తోంది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న శేఖర్ కమ్ముల ధనుష్ గురించి ఇంట్రస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.. ‘ ‘కుబేర’ స్క్రిప్ట్ రాయడం పూర్తి అయ్యాకా, ధ‌నుష్‌కు కథ చెబుదామ‌నిపించింది. కానీ బిచ్చగాడి పాత్ర గురించి త‌న‌కు ఎలా చెప్పాలా అని సంకోచించా. అసలు ఇంత‌కీ నేనెవ‌రో త‌న‌కు తెలుసో లేదో అని కూడా ఒక అనుమానం నాలో ఉంది. కానీ ధ‌నుష్‌కు ఫోన్ చేయ‌గానే ఆయ‌న న‌న్ను ఆశ్చర్యప‌రిచారు. నేను తీసిన సినిమాలో తన ఫేవ‌రెట్ సినిమాల గురించి.. వాటిలోని సీన్ల గురించి మాట్లాడ్డం మొద‌లుపెట్టారు. అది నాకు పెద్ద షాక్. ధ‌నుష్ లాంటి మంచి న‌టుడితో ప‌ని చేయ‌డం నాకు గొప్ప అనుభ‌వం. ఇక ఇందులో హీరోయిన్ రష్మంక గురించి చెప్పాలి అంటే ఈ సినిమాలో ప‌క్కింటి అమ్మాయి త‌ర‌హా పాత్రలో క‌నిపిస్తుంది. ఇందులో ధ‌నుష్‌, ర‌ష్మిక జంట స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంటుంది. నేనీ క‌థ చెప్పడానికి ర‌ష్మిక‌ను క‌లిసిన‌పుడు తను ముంబ‌యిలో ‘యానిమ‌ల్’ సినిమాకు సంబంధించిన ప‌నిలో ఉంది. అదే స‌మ‌యంలో ‘పుష్ప-2’ షూటింగ్‌లోనూ పాల్గొంటోంది. అలా తను ముంబ‌యి టు హైద‌రాబాద్ విరామం లేకుండా తిరుగుతూ కూడా మ‌ళ్లీ మా సినిమా కోసం వ‌చ్చి ఏమాత్రం అలసట, అస‌హ‌నం లేకుండా ప‌ని చేసింది’ అని శేఖ‌ర్ తెలిపాడు. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.