Shekar Kamala: ధనుష్ అలా మాట్లడుతాడని అసలు ఊహించలేదు : శేఖర్ కమ్ముల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ హీరోగా ‘కుబేర’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ముందుగా వీరిద్దరి కాంబోలో మూవీ అంటే.. ఆశ్చర్యకరమైన విషయం అని చెప్పాలి. ఎందుకంటే సున్నితమైన లవ్ స్టోరీలు, ఫీల్ గుడ్ సినిమాలు తీసే కమ్ముల.. తమిళంలో అని జానర్లలో సినిమాలు చేసే ధనుష్‌తో జత కడతాడని ఎవ్వరూ ఊహించలేరు.అలాటి వీరిద్దరి కలయికలో తెరకెక్కుతున్న ఈ ‘కుబేర’ సినిమా పై బారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్‌గా విడుదలైన టీజర్ చూస్తే.. కమ్ముల ధనుష్‌కి నప్పే సినిమానే చేస్తున్నట్లు క్లియర్‌గా తెలుస్తోంది.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న శేఖర్ కమ్ముల ధనుష్ గురించి ఇంట్రస్టింగ్ విషయాలు పంచుకున్నాడు.. ‘ ‘కుబేర’ స్క్రిప్ట్ రాయడం పూర్తి అయ్యాకా, ధనుష్‌కు కథ చెబుదామనిపించింది. కానీ బిచ్చగాడి పాత్ర గురించి తనకు ఎలా చెప్పాలా అని సంకోచించా. అసలు ఇంతకీ నేనెవరో తనకు తెలుసో లేదో అని కూడా ఒక అనుమానం నాలో ఉంది. కానీ ధనుష్‌కు ఫోన్ చేయగానే ఆయన నన్ను ఆశ్చర్యపరిచారు. నేను తీసిన సినిమాలో తన ఫేవరెట్ సినిమాల గురించి.. వాటిలోని సీన్ల గురించి మాట్లాడ్డం మొదలుపెట్టారు. అది నాకు పెద్ద షాక్. ధనుష్ లాంటి మంచి నటుడితో పని చేయడం నాకు గొప్ప అనుభవం. ఇక ఇందులో హీరోయిన్ రష్మంక గురించి చెప్పాలి అంటే ఈ సినిమాలో పక్కింటి అమ్మాయి తరహా పాత్రలో కనిపిస్తుంది. ఇందులో ధనుష్, రష్మిక జంట స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉంటుంది. నేనీ కథ చెప్పడానికి రష్మికను కలిసినపుడు తను ముంబయిలో ‘యానిమల్’ సినిమాకు సంబంధించిన పనిలో ఉంది. అదే సమయంలో ‘పుష్ప-2’ షూటింగ్‌లోనూ పాల్గొంటోంది. అలా తను ముంబయి టు హైదరాబాద్ విరామం లేకుండా తిరుగుతూ కూడా మళ్లీ మా సినిమా కోసం వచ్చి ఏమాత్రం అలసట, అసహనం లేకుండా పని చేసింది’ అని శేఖర్ తెలిపాడు. ప్రజంట్ ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Also Read
- Former Miss India: మాజీ మిస్ ఇండియాకు ఎట్టకేలకు బంపర్ ఆఫర్.. ‘జార్జ్ క్రిష్’లో శర్వానంద్ సరసన ఛాన్స్!
- Telangana Film Chamber: సినిమా థియేటర్ల టికెట్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష చేయాలి!
- Shiva Nirvana: రవితేజ ‘ఇరుముడి’లో విలన్ ఎవరో కాదు.. షాక్ ఇచ్చిన డైరెక్టర్ డైరెక్టర్ శివ నిర్వాణ!
- Nagarjuna: ‘గీతాంజలి’ నా కెరీర్‌ను మార్చేసింది.. చైతూ, అఖిల్‌కు నాగార్జున బిగ్ అడ్వైజ్ ఇదే!
తాజావార్తలు
-
Botsa Satyanarayana: డీఎస్సీపై చర్చకు ఎందుకు రాలేదు?: సవాళ్లు మాత్రం విసురుతారు..
-
Cupid Share: కండోమ్ కంపెనీకి కాసుల వర్షం.. రాబడి ఎంతో తెలుసా!
-
AP Assembly: ఏపీ అసెంబ్లీ నిరవధిక వాయిదా.. 4 రోజుల్లో 12 బిల్లులకు ఆమోదం
-
Lucknow Crime: భార్యను చంపి.. వాట్సాప్ స్టేటస్‌లో షాకింగ్ మెసేజ్! ఆ తర్వాత గంటల్లోనే మరో దారుణం, చివరికి సూసైడ్..
-
Telangana High Court : కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై హైకోర్టు ఫైర్.. స్టే ఎత్తివేతకు నిరాకరణ.!
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!