NTV Telugu Site icon

Shocking: సోషల్ మీడియాలో హీరోయిన్‌ ప్రైవేట్‌ వీడియోలు లీక్‌.. అతని పనేనంటూ కేసు నమోదు!

Sheetal Patro

Sheetal Patro

Sheetal Patra alleged Dayanidhi Dahima leaked her intimate videos online: ఒడిశా సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ నటి శీతల్ పాత్రో తాజాగా ప్రముఖ ఒడిశా సినీ నిర్మాత దయానిధి దాహిమాపై షాకింగ్ ఆరోపణలు చేసింది. దయానిధి తనను వేధించారని శీతల్ పాత్రో ఆరోపించారు. అంతే కాకుండా శీతల్ పాత్రో దయానిధి దాహిమా తన MMS వీడియోలు, ప్రైవేట్ ఫోటోలను లీక్ చేశాడని తీవ్రమైన ఆరోపణలు చేసింది. నిజానికి ముందు నుంచి దయానిధి దహిమా, శీతల్‌ పాత్రో మధ్య మంచి అనుబంధం ఉండేదని, సన్నిహిత్యం ఏర్పడి అది ఫిజికల్‌ రిలేషన్‌ షిప్‌ వరకు వెళ్లిందని అంటున్నారు. అయితే వారిద్దరూ ఫిజికల్ అయ్యాక ఆమె వేరే వ్యక్తులతో కూడా సినిమాలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య దూరం పెరిగి గొడవలు పడ్డారు. ఈ ఏడాది మార్చిలో తాను ఈ విషయం మీద స్పందిస్తూ సోషల్‌ మీడియాలో పోస్ట్ పెట్టి దయా ఎంటర్టైన్‌మెంట్స్ కి చెందిన దయానిధి దహిమాకి తనకి ఏమీ లేదని వెల్లడించింది. ఇక ఇప్పుడు తాజాగా ఈ అంశం మీద శీతల్ పాత్రో లక్ష్మీ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది .

Jailer Showcase: బాషా లెవల్ ఎలివేషన్స్.. ‘టైగర్’ ముత్తువేల్ పాండియన్ ఆన్ డ్యూటీ

ఇక ఆమె చెబుతున్న దాని ప్రకారం నిర్మాత దయానిధి దహిమాతో తాను కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నానని, అయితే ఈ రిలేషన్ ఉండగా ఎమోషనల్ డామేజ్ అలాగే ఎమోషనల్ గా తాను దోపిడీ ఎదుర్కోవలసి వచ్చిందని శీతల్ చెప్పింది. దయానిధి తనను లైంగిక, మానసిక వేధింపులకు గురి చేశాడని ఇప్పుడు తనను బ్లాక్‌ మెయిల్‌ చేస్తున్నాడని, తనకు ఇచ్చిన పారితోషికం తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది. అంతేకాక తాను చదివే కాలేజ్‌లో విద్యార్థుల ముందే తన యూనిఫామ్‌ చించేసి, తీవ్రమైన అవమానానికి గురి చేశాడని వెల్లడించింది. ఇక ఇప్పుడు నా పరువు దిగజార్చడానికి సోషల్‌ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నాడని, తన ఫ్యామిలీని కూడా కించపరిచేలా వ్యవహరిస్తున్నారని ఆమె పేర్కొంది. ఇక తనతో సన్నిహితంగా ఉన్నప్పుడు ఫోటోలు, వీడియోలు రికార్డ్ చేసేవాడని అప్పుడు వాటిని పట్టించుకోలేదు కానీ ఇప్పుడు వాటిని లీక్ చేసి తన జీవితం నాశనం చేయడానికి చూస్తున్నాడని ఆమె పేర్కొన్నారు.