Sharwanand : భిన్నమైన సినిమాలు చేస్తాడని పేరు తెచ్చుకున్న శర్వానంద్ ఇటీవల తన కొత్త వెంచర్ OMI ప్రకటించాడు. అయితే, ఇప్పుడు తాజాగా శర్వానంద్ కొత్త ఫోటోషూట్ ఒకటి రిలీజ్ అయింది. ఈ ఫోటోలలో శర్వానంద్ ఒకపక్క చార్మింగ్‌గా కనిపిస్తూనే ఫుల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌తో అదరగొట్టాడు. ఇక, శర్వానంద్ ఈ లుక్ కోసం సుమారు 6 నెలల పాటు కఠినంగా ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి ట్రాన్స్‌ఫర్మేషన్ అయ్యాడట. దీనికోసం విదేశాలకు వెళ్లి కూడా ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నాడు. ఇండియాలో ఒక ట్రైనర్‌తో పాటు విదేశాల్లో ఇతర ట్రైనర్‌లను నియమించుకొని ఈ బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్ సాధించాడు.
Read Also : OG : పవన్ కల్యాణ్ పాడిన సాంగ్ రిలీజ్..
విదేశాలకు వెళ్లి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడమే కాదు, జిమ్‌లో బాడీని ట్రైన్ చేస్తూ మరోపక్క యోగా చేస్తూ తన మేకోవర్ కోసం హార్డ్ వర్క్ చేస్తూ బాడీని ట్రాన్స్ఫర్మేషన్ రెడీ చేశాడు. శర్వానంద్ న్యూ లుక్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శర్వా ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు. ఒకప్పటికీ ‘నారీ నారీ నడుమ మురారి’ అనే సినిమాతో పాటు ‘భోగి’ సినిమాతో పాటు తన 36వ సినిమాను కూడా సిద్ధం చేస్తున్నారు.
Read Also : K-RAMP Teaser : బోల్డ్ లిప్ లాక్ లు.. టీజర్ నిండా బూతులు..
