NTV Telugu Site icon

Sharwanand: కారు ప్రమాదంపై స్పందించిన శర్వానంద్.. ఏమన్నాడంటే ..?

Sharwa

Sharwa

Sharwanand: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్ కారుకు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి రోడ్ నెంబర్ 45, సివిఆర్ జంక్షన్ వద్ద అర్ధరాత్రి 3 గంటల ప్రాంతంలో శర్వా రేంజ్ రోవర్ కారు అదుపుతప్పి ఫుట్ పాత్ ను ఢీకొంది. ఇక ఈ ప్రమాదం జరిగే సమయంలో శర్వానంద్ కారులో లేడని తెలుస్తుంది. మద్యం మత్తులో శర్వా డ్రైవర్ ఈ యాక్సిడెంట్ చేసినట్లు పోలీసులు ధ్రువీకరించారు. ఇక ఈ విషయం తెలియడంతో శర్వా అభిమానులు ఆయనకు ఏమైందో అని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలోనే తనకు ఏమి కాలేదని, కంగారు పడాల్సిన అవసరం లేదని శర్వా స్వయంగా ట్వీట్ చేశాడు.

“ఉదయం నా కారు ప్రమాదానికి గురైంది, ఇది చాలా చిన్న ఘటన. మీ అందరి ప్రేమ, ఆశీర్వాదాలతో నేను ఇంట్లో పూర్తిగా సురక్షితంగా.. ఆరోగ్యంగా ఉన్నాను. ఎవరు చింతించాల్సిన పనిలేదు. అందరికీ ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇకపోతే వచ్చే నెలనే శర్వా పెళ్లి జరగనుంది. రక్షిత అనే యువతిని శర్వా వివాహమాడనున్నాడు. ఇప్పటికే వీరి ఎంగేజ్ మెంట్ ఘనంగా జరిగిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే శర్వాకు ఇలా ప్రమాదం జరగడం ఏంటని అభిమానులు ఆందోళన చెందారు. అయితే, ఆ కారులో శర్వా లేకపోవడంతో వారు ఊపిరి పీల్చుకున్నారు. ఇక జాను సమయంలో ఈ హీరోకు భారీ యాక్సిడెంట్ అయిన విషయం తెల్సిందే. అప్పుడే ఆయన బరువు పెరిగారు. ఇక దాని తరువాత హెల్త్ మీద చాలా కేర్ తీసుకుంటున్నాడు శర్వానంద్. ప్రస్తుతం పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న ఈ హీరో పెళ్లి తరువాత సెట్స్ మీదకు వెళ్లనున్నాడు.